♦ రూ. వందల కోట్ల అంశం కావడంతో సందిగ్ధంలో ప్రభుత్వం
♦ క్షుణ్నంగా సమీక్షించిన మీదటే నిర్ణయం
♦ దాదాపు రూ.2 వేల కోట్లు భారం పడే అవకాశం
ముంబై : ముంబై నగరంలో ఐదు టోల్‌ప్లాజాల్లో టోల్ రద్దు విషయంపై ప్రభుత్వం గత మూడు నెలలుగా జాప్యం చేస్తోంది. రూ.వందల కోట్ల అంశం కావడంతో దీనిపై క్షుణ్నంగా సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టోల్ మినహాయింపుపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. మూడు నెలల్లో పూర్తి నివేదికతో రావాలని కమిటీకి సూచించారు. కమిటీ సోమవారం నివేదిక సమర్పించినప్పటికీ టోల్ మినహాయింపుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
నివేదిక పరిశీలించిన సీఎం.. వాషి, దహిసర్, ములుండ్, ఐరోలీ, ఎల్‌బీఎస్ మార్గ్ ప్రాంతాల్లోని టోల్ మార్గాల్లో మూడు నెలల్లో సరైన గణాంకాలతో మరో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారని పీడబ్ల్యూడీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల్లో ఎమ్మెస్‌ఆర్‌డీసీ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు టోల్ వసూలు చేస్తారు. చిన్న వాహనాలను టోల్ నుంచి మినహాయించి పెద్ద వాహనాలకు టోల్ వసూలు చేయాలని కమిటీ సీఎంకు సూచించింది.
టోల్ మినహాయిస్తే కాం ట్రాక్టర్లకు రూ. 2000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని మంత్రి తెలి పారు. సంబంధిత మంత్రి ఏక్‌నాథ్ షిండే కార్పొరేషన్ అధికారులతో చర్చించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టోల్ భారం నుంచి ముంబైకర్లకు విముక్తి కలిగించాలని ప్రయత్నిస్తున్నామని, అయితే ఆ భారం కాంట్రాక్టర్లపై పడకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పాటిల్ చెప్పారు. కొల్హాపూర్‌లోని తొమ్మిది టోల్‌ప్లాజాల్లో టోల్ మినహాయింపుపై ప్రశ్నించగా.. ప్లాజాలను మూసేయడం వల్ల పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం, స్థానిక సంస్థలు కలసి భరిస్తాయని అన్నారు. ఇటీవల మూసేసిన 63 టోల్‌ప్లాజాలపై కాంట్రాక్టర్లకు రూ.800 కోట్లు నష్టపరిహారంగా అందజేసింది
‘టోల్ రద్దు’పై జాప్యం
Published Wed, Jul 29 2015 4:33 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement