దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో టోల్‌ను అమాంతం మూడు రెట్లు పెంచడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య....
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో టోల్‌ను అమాంతం మూడు రెట్లు పెంచడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఇక్కడ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో సమావేశమయ్యారు. టోల్‌ను తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ టోల్ ఛార్జీ నిర్ణయం కేంద్ర రహదారుల శాఖ పరిధిలోకి వస్తుందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని అన్నారు. వాహనదారుల నుంచి వ్యక్తమవుతున్న నిరసన నేపథ్యంలో దీనిపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే పెంచిన మొత్తం టోల్‌ను ఉపసంహరించుకునే విషయంలో ఆయన స్పష్టంగా ఏమీ చెప్పలేక పోయారు.