సాక్షి, ముంబై: వాహన చోదకుల్లో మార్పు వచ్చినప్పుడే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. అందరూ ట్రాఫిక్ నియమాల ను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న వాహనాలతో పాటు నగర రోడ్లను మరింత విస్తరించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ట్రాఫిక్ పోలీస్ చీఫ్ డాక్టర్ బి.కె.ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిం చడం ద్వారా జరిమానా చెల్లించాల్సి వస్తుందన్న అవగాహన వాహన చోదకుల్లో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.
అందుకే జరిమానాను భారీగా పెంచితే అప్పుడైనా ట్రాఫిక్ నియమాలను పాటిస్తారో చూడాలని తెలిపారు. ఇంటికి వెళ్లాలనే తొందరలో చాలా మంది ట్రాఫిక్ నియమాలను తుంగలో తొక్కుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. కొన్ని నిబంధనలు అసౌకర్యంగా భావిం చి పాటించడం లేదని తెలిపారు. ‘లేన్ డిసిప్లేన్ లేకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందు వేగంగా వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అనేక మంది మృతి చెందుతున్నార’ని చెప్పారు. చాలా సందర్భాలలో వాహన చోదకులు సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఉన్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు. లేదంటే వారు నియమాలను గాలికి వదిలేస్తున్నారన్నారు.
ట్రాఫిక్ నియమాలు వాహన చోదకుల జాగ్రత్త కోసం రూపొందిం చినవని, వారికి అసౌకర్యం కలిగించేందుకు కాదని తెలిపారు. దీనిని నగరవాసులు అర్థం చేసుకొని నియమాలను పాటించాలని కోరారు. ‘ట్రాఫిక్ శాఖలో సిబ్బంది కొరత వల్ల ప్రతి జంక్షన్, సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసును అందుబాటులో ఉంచడం సాధ్యం కావడం లేదు. దీనిని చాలామంది వాహన చోదకులు ఆసరాగా తీసుకొని నిబంధనలు ఉల్లంఘిస్తున్నార’ని మండిపడ్డారు. నగరవాసుల్లో ట్రాఫిక్ నియమాలు తమ కోసం రూపొందించారనే అవగాహన వచ్చినప్పడే ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఇదిలావుండగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ట్రాఫిక్ పోలీసులు భారీగానే జరిమానా వసూలు చేశారు. 5,34,783వారి నుంచి రూ.6,01,43,500 వసూళ్లు చేశారు. 2013లో నియమాలు ఉల్లఘించిన 20,48, 604 వాహన చోదకుల నుంచి రూ.23,09,82,860 వసూలు చేశారు. 2012లో 15,17,783 మంది నుంచి రూ.23,09,82,860 వసూలు చేశారు.
వాహన చోదకుల్లో మార్పు రావాలి
Published Sun, May 4 2014 10:55 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement