పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభకు ఎన్నికైన డీ.కే సురేష్‌కుమార్, రమ్యలు నేడు (సోమవారం) 10:30 గంటలకు ఢిలీలోని పార్లమెంట్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సాక్షి, బెంగళూరు : పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభకు ఎన్నికైన డీ.కే సురేష్‌కుమార్, రమ్యలు నేడు (సోమవారం) 10:30 గంటలకు ఢిలీలోని పార్లమెంట్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వారు ఆదివారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారితో పాటు కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్, కన కపుర ఎమ్మెల్యే, సురేష్‌కుమార్ సోదరుడు డి.కే శివ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లి వారిలో ఉన్నారు. సోమవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని వారిరువురూ మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు.
హైకమాండ్‌కు వదిలి పెట్టా...
ఉప ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన డీ.కే సురేష్‌కుమార్‌తో కలిసి డి.కే శివకుమార్ ఆదివారం బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఎస్.ఎం కృష్ణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తనకు మంత్రి పదవి ఇవ్వాలా లేదా అన్నది పార్టీ హైకమాండ్‌తో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వదిలిపెట్టానన్నారు. ఈ
ప్రతిపాదనతో తాను పార్టీ పెద్దలను కలవడం లేదన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వారికి వివ రించడానికి మాత్రమే ఢిల్లీ వెలుతున్నాని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో సాధించిన తర్వాత మంత్రిమండలిలో స్థానం ఆశించిన మాట వాస్తవమన్నారు. ఆయితే మూడు నెలలు ఓపిక పట్టాలని, లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయమని అప్పట్లో హైకమాండ్ సూచించిందన్నారు. తాను అప్పుడు పెద్దల మాట విన్నానన్నారు. ఇక ఇప్పుడు తనకు మంత్రిమండలిలో స్థానం కల్పించడమా లేదా అన్నది వారి చేతుల్లోనే ఉందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.