రేపు కొరాపుట్‌లో బందు | tomorrow Bhadu in Koraput | Sakshi
Sakshi News home page

రేపు కొరాపుట్‌లో బందు

Published Sun, Oct 15 2017 11:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

tomorrow Bhadu in Koraput - Sakshi

జయపురం: కొరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీసు స్టేషన్‌ పరిధి సోరిసపొదర్‌ గ్రామం అడవిలో ఆదివాసీ విద్యార్థినిపై ఇటీవల జరిగిన సామూహిక లైంగికదాడిని మావోయిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ అమానుష సంఘటనతో మావోయిస్టులకు సంబంధం ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు వెల్లబుుచ్చిన అభిప్రాయంపై ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌ మావో స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు జగబందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులతో శనివారం ఆయన ఫోన్లో మాట్లాడారు. సంఘటన జరిగి నాలుగు రోజులు అయినా దోషులను గుర్తించి, అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు, క్రైం బ్రాంచ్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇటువంటి అమానుష ఘటనలో పోలీసులు మమేకమయ్యారని ఆరోపించారు. పోలీసుల తీరును ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ సంఘటనలో దోషులను శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనలు జరుపుతున్న వారికి మావోయిస్టులు పూర్తి మద్దతు ఇస్తారని వెల్లడించారు.

 ఈ మేరకు సోమవారం కొరాపుట్‌ జిల్లా బందుకు మావోలు పిలుపునిస్తున్నారని తెలిపారు. మరోపక్క జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం కొరాపుట్‌ జిల్లా బందుకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క మావోయిస్టులు బందుకు పిలుపునీయటంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1  గంట వరకు బందుకు పిలుపు ఇవ్వగా, మావోయిస్టులు సమయ నిర్ధారణ లేకుండా బందుకు పిలుపునిచ్చారు. మావోలు బందుకు పిలుపునివ్వడంతో మావో ప్రభావిత ప్రాంతాలు ముఖ్యంగా నారాయణపట్న, బందుగాం, పొట్టంగి, సెమిలిగుడ, నందపూర్‌  లమతాపుట్, లక్ష్మీపూర్‌ తదితర ప్రాంతాలలో బందు తీవ్రంగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బందుతో జనజీవనం, రవాణా స్తంభించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దోషులను అరెస్టు చేయండి
జయపురం:కొరాపుట్‌ జిల్లా కుందులి సమీప సోరిసిపొదర్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ముసాసగుడ గ్రామం విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి చేయడం దారుణమని కొరాపుట్‌ జిల్లా భారతీయ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు జయపురంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. జయనగర్‌లోని జయపురం çసబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర గవర్నర్‌కు ఉద్దేశించి రాసిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ఈ సంఘటన జరగటంతో దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన దుండగులు ఎవరైనా వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనకు కొరాపుట్‌ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర రౌళో, సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోదకుమార్‌ మహంతి తదితరులు నాయకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement