సాక్షి, ముంబై: ఠాణే, ముంబై, నవీముంబై పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గమ్యానికి ఎప్పుడు చేరతామో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి నగరవాసులను గట్టెక్కించేందుకు ఠాణే రవాణాశాఖ ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఫోన్ వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటే ముంబై, నవీముంబై, ఠాణేలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. ఠాణే పోలీస్ కమిషనర్ కె.పి. రఘువంశీ చేతుల మీదుగా ఈ సేవలను ప్రారంభించారు. ‘ట్రాఫ్‌లైన్’అనే ఈ మోబైల్ అప్లికేషన్‌ను బ్లాక్‌బెర్రీతోపాటు, ఆండ్రాయిడ్, ఐఫోన్ మోబైల్ ఫోన్లలో సులువుగా వినియోగించుకోవచ్చు. ఠాణే నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ముంబై, నవీముంబై పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
కొన్ని సార్లు ట్రాఫిక్ సమస్య కారణంగా మధ్యలోనే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి. అయితే ఈ అప్లికేషన్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుంటే ట్రాఫిక్ పరిస్థితి ఏమిటనేది ముందుగానే తెలుస్తుంది. తద్వారా గంటల తరబడి అందులో చిక్కుకోవాల్సిన అవసరముండదు. సమయంతో పాటు ఇంధనం కూడా పొదుపవుతుంది. ఈ అప్లికేషన్‌లో మ్యాప్, ట్రాఫిక్ అలర్ట్ సూచన, గమ్యస్థానానికి చేరుకునేందుకు గెడైన్స్, అలాగే గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందనే సమాచారం కూడా పొందవచ్చు. అప్లికేషన్‌తోపాటు వెబ్‌సైట్ సౌకర్యం కూడా కల్పించినట్లు డీసీపీ శ్రీకాంత్ పరోపకారి తెలిపారు. ఇంటర్‌నెట్ ద్వారా www.traffline.com వెబ్‌సైట్‌పై కూడా ట్రాఫిక్ సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చన్నారు.
ట్రాఫిక్ ఇక్కట్లకు ‘యాప్’తో చెక్
Published Sat, Oct 12 2013 12:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement