గెటప్ మార్చిన ఉదయనిధి | Udhayanidhi Stalin in Action Getup for 'Geththu' | Sakshi
Sakshi News home page

గెటప్ మార్చిన ఉదయనిధి

Published Sat, May 23 2015 2:38 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

గెటప్ మార్చిన ఉదయనిధి - Sakshi

గెటప్ మార్చిన ఉదయనిధి

 వేషం మారెను, భాషను మార్చెను అసలు మనిషే మారెను అన్న పాట చందానా గెత్తు చిత్రం కోసం నటుడు ఉదయనిధి స్టాలిన్ గెటప్ మార్చారు. ఒరుకల్ ఒరు కన్నాడి, ఇదు కదిర్‌వేలన్ కాదల్, నన్భేండా చిత్రాల తరువాత ఉదయనిధి స్టాలిన్ నటించి నిర్మిస్తున్న చిత్రం గెత్తు. ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ తిరుకుమరన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కరుణాకరన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
 ముందు చిత్రాల్లో లవర్ బాయ్‌గా కనిపించిన ఉదయనిధి స్టాలిన్ ఈ తాజా చిత్రంలో యాక్షన్ హీరోగా కనిపించనున్నారట. అలాగని పూర్తి మాస్‌గా కనిపించరని సమాచారం. అమాయకంగా యువకుడి ఉదయనిధి కనిపిస్తే అందుకు పూర్తి వ్యతిరేకంగా సత్యరాజ్ పాత్ర ఉంటుందట. అలా ఒక రౌడీతో తల పడ్డ సత్యరాజ్ కథ కుటుంబానికి తెలియడంతో ఆ తరువాత హీరో ఉదయనిధి స్టాలిన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చిత్రం కథ అని తెలిసింది. ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తి అయిన గెత్తును ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement