ఉత్తమ్‌ను భయపెట్టిన ఎద్దులు | uttma kumar reddy visits nalgonda district | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌ను భయపెట్టిన ఎద్దులు

Published Thu, Apr 6 2017 4:31 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

ఉత్తమ్‌ను భయపెట్టిన ఎద్దులు - Sakshi

ఉత్తమ్‌ను భయపెట్టిన ఎద్దులు

మేళ్లచెర్వు: నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలం నక్కగూడెంలో ఎడ్లపందేల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నిర్వహిస్తున్న ఎడ్ల పందేలను ప్రారంభించేందుకు గురువారం ఉదయం టీపీసీసీ చైర్మన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లారు. అనంతరం తిలకించేందుకు వచ్చిన జనం అరుపులు, కేకలతో పందేల్లో పాల్గొనాల్సిన ఎద్దులు బెదిరిపోయాయి. అవి జనం మీదికి దూసుకురావటంతో అక్కడే ఉన్న ఉత్తమ్‌కు ఎటువంటి ప్రమాదం జరగకుండా నాయకులు, ఎస్కార్టు సిబ్బంది ఆయన్ను దూరంగా తీసుకెళ్లారు. ఎద్దులను నియంత్రించారు. అయితే, ఉత్తమ్‌ తిరిగి పోటీలను చూసేందుకు వెళ్లకుండానే తిరుగుపయనమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement