విద్యా వ్యాపారీకరణను ప్రతిఘటిద్దాం
విద్యా వ్యాపారీకరణను ప్రతిఘటిద్దాం
Published Fri, Sep 30 2016 11:24 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
నల్లగొండ టౌన్ : విద్యా వ్యాపారీకరణ, కాషాయీకరణను విద్యార్థులందరూ ప్రతిఘటించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు బొల్గురి కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికంగా జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యను ఒక వ్యాపార వస్తువుగా మార్చి పేదలకు అందని ద్రాక్షగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి.అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.సైదులు, ఉపాధ్యక్షుడిగా ఎ.హరీష్, సహాయ కార్యదర్శిగా ఎస్‌కె.యూసుఫ్, కోశాధికారిగా గౌతమ్, కార్యవర్గ సభ్యులుగా సుభాష్, ప్రవీణ్, వినిత్, నాగరాజు, రవితో పాటు 13 మందితో కమిటీని ఎన్నుకున్నారు.
Advertisement