
నపుంసకుడితో వివాహం జరిపించారు!
తన భర్త నపుంసకుడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బాణసవాడి పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది.
భర్తపై భార్య ఫిర్యాదు
బెంగళూరు(బనశంకరి) :
తన భర్త నపుంసకుడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బాణసవాడి పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... బాణసవాడికి చెందిన జూలీ (పేరుమార్చాము)కి 2014లో రాబర్ట్ (పేరు మార్చాము) అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన మొదటి రాత్రే తన భర్త నపుంసకుడిగా తేలిందని, సంసారానికి పనికిరాని వ్యక్తితో తనకు వివాహం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మోసం చేసి తన జీవితం నాశనం చేసిన భర్త, అత్త, మామపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది.