ఢిల్లీ కాంగ్రెస్ కూడా తాజా అసెంబ్లీ ఎన్నికలకే మొగ్గు చూపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్‌కు మరోసారి సహకరించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చింది. ‘అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ సుప్రీంకోర్టులో పోరాడింది. అలాంటి పార్టీకి ఇప్పటి ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను వదిలిపెట్టి పోయారు. అలాంటి పార్టీకి మేం ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోం’ అని డీపీసీసీ అధికార ప్రతినిధి ముకేశ్ శర్మ స్పష్టం చేశారు. ఆప్‌తోపాటే కాంగ్రెస్ ఏడు స్థానాల్లోనూ ఓటమి పాలు కావడం తెలిసిందే. కేజ్రీవాలే ఫిబ్రవరిలో పదవిని వదిలేసి వెళ్లిపోయారని, అప్పుడు తాము ఆప్‌కు మద్దతు ఉపసంహరించలేదని వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు కాబట్టి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ కారణంగా ఢిల్లీలో సెక్యూరిటీ ఓట్లు చీలి మోడీ లాభపడ్డాడని విమర్శించారు. కొందరు ఆప్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి సహకరించారని ముకేశ్ శర్మ ఆరోపించారు.
ఆప్‌కు మద్దతు ఇవ్వబోం: కాంగ్రెస్
Published Sun, May 18 2014 11:25 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement