కల్తీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి | ysrcp mp yv subba reddy meets agriculture officer over Adulterated seeds | Sakshi
Sakshi News home page

కల్తీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

Published Tue, Oct 4 2016 11:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కల్తీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి - Sakshi

కల్తీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తరగతులు
వ్యవసాయ శాఖ జేడీఏతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
 
ఒంగోలు : రైతులకు కల్తీ విత్తనాలు పంపిణీ చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు మురళీకృష్ణ సోమవారం ఎంపీ కార్యాలయంలో ఆయన్ను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ పలు సూచనలు చేశారు. దోర్నాల, త్రిపురాంతకం మండలాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు.

రబీలో పెసర, అలచందలు, శనగ విత్తనాలు పంపిణీ చేసేటపుడు ఎటువంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్‌ పద్ధతిని అనుసరించాలని సూచించారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫామింగ్‌ వారితో ఈ నెల 18వ తేదీ మార్కాపురం పట్టణంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేలా శిక్షణ  ఏర్పాటు చేస్తున్నట్లు జేడీఏకి తెలిపారు.  ముఖ్యంగా మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం డివిజన్‌లలోని రైతులు ఎక్కువమంది వచ్చేలా చూడాలన్నారు. 19వ తేదీ కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో ప్రదర్శనక్షేత్రం చేపట్టాలని దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జేడీఏకి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement