
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సాక్షి, చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించి పోయింది. రహదారులన్నీ జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.