అన్న ఎఫెక్ట్: ఆర్‌కాం సరికొత్త ఆఫర్
రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో టెలికాం కంపెనీలన్నీ రోజుకో కొత్త ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. జియోకు కౌంటర్‌గా కంపెనీలు తమ ప్లాన్లను మార్కెట్‌లోకి ఆవిష్కరిస్తున్నాయి.
రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో టెలికాం కంపెనీలన్నీ రోజుకో కొత్త ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. జియోకు కౌంటర్‌గా కంపెనీలు తమ ప్లాన్లను మార్కెట్‌లోకి ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా అన్న ముఖేష్ అంబానీకి కౌంటర్‌గా తమ్ముడు అనిల్ అంబానీ కంపెనీ ఆర్‌కామ్ కూడా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా రూ.299 రెంటల్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, టెక్ట్స్, డేటాను తమ సబ్‌స్క్రైబర్లకు అందించనున్నట్టు ఆర్‌కామ్ పేర్కొంది. '' రిలయన్స్ మొబైల్ ఇప్పటివరకు అత్యంత చౌకైన రేట్లను ప్రవేశపెట్టింది. 299 రూపాయలతో నెలవారీ రెంటల్ ప్లాన్‌ను ప్రారంభింస్తోంది'' అని ఆర్‌కామ్ ట్వీట్ చేసింది.
అయితే దీనికి సంబంధించి మిగతా ఏ వివరాలను ఆర్‌కామ్ పేర్కొనలేదు. కేవలం ఒక్క ట్వీట్ మాత్రమే చేసింది. గతవారమే ఆర్‌కామ్ ఏడాది మొత్తానికి సరిపడా ఓ సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఆ కొత్త ఆఫర్‌ను రూ.5199కి లాంచ్ చేసింది. దాని కింద యూజర్లు ఏడాదంతా రోజుకు 1జీబీ 4బీ డేటాను వాడుకోవచ్చు. అదనంగా రూ.3,200 విలువైన వైఫై డోంగల్ ''వైఫ్-పాడ్'' ను కస్టమర్లు ఉచితంగా పొందనున్నారు. దీనికి కూడా 365 రోజుల వాలిడిటీని కంపెనీ అందిస్తోంది.