బాల్కొండ: బాబ్లీ గేట్ల ఎత్తివేతతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ)లోకి 0.37 టీఎంసీల నీరు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. 0.7 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని ముందుగా ప్రకటించినా అందులో సగం మాత్రమే నీరు వచ్చి చేరింది. మిగతాది వచ్చే అవకాశం లేదని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు.
ఎస్సారెస్పీ నుంచి నీటిని వెనక్కు లాక్కునే విధంగా రివర్స్ గేట్లతో బాబ్లీ ప్రాజెక్ట్‌ను నిర్మించిన మహారాష్ట్ర సర్కార్... గేట్లు ఎత్తిన తర్వాత ఏమైనా మాయ చేసి ఉండవచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1067.70 అడుగులు ఉంది.
ఎస్సారెస్పీలోకి 0.37 టీఎంసీల నీరు
Published Thu, Jul 3 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement