బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామాలంగా మార్చి ఉత్తర తెలంగాణకే కల్పతరువుగా నిలిచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌నకు శ్రీరాంసాగర్‌గా నామాకరణం చెంది నేటికి 36 ఏళ్లు పూర్తయింది. 1978 కి ముందు శ్రీరాంసాగర్ పోచంపాడ్ గానే వెలుగొం దింది. కాగా 1978 నవంబర్ 5న ప్రాజెక్ట్‌కు అధికారిక పర్యాటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి పోచంపాడ్ ఉద్యోగులు ఒక విన్నపం చేశారు. ఆ విన్నపం మూలంగానే పోచంపాడ్ నేటి శ్రీరాంసాగర్‌గా మారింది.
విన్నపం ఏమంటే...ఉతర్త తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ ఇంత మందికి ఉద్యోగాలు కల్పించిన ప్రాజెక్ట్‌ను పోచం‘పాడు’గా పిలువడం బాధాకరమని విన్నవిం చారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పవిత్ర గోదావరి నదీ తీరాన రామాలయం ఉంది. కావున పోచంపాడ్‌కు శ్రీరాంసాగర్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడే ప్రాజెక్ట్‌కు ఉన్న మూడు ప్రధాన కాలువలకు కూడ పేర్లు మార్చారు. అప్పటి నుంచి ప్రాజె క్ట్ శ్రీరాంసాగర్‌గా పిలువబడుతుంది.
‘శ్రీరాంసాగరానికి’ 36 ఏళ్లు..
Published Wed, Nov 5 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement