శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గొల్కొండ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఓ బొగ్గు లారీ టైర్ పంక్చర్ కావడంతో.. డ్రైవర్, క్లీనర్ టైర్ మార్చే పనిలో ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనం ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.