ఉట్నూర్ : జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని 123 ఆశ్రమాల్లో దాదాపు 38,821 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2012 అక్టోబర్‌లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఐటీడీఏ పీవోలు, జిల్లా వైద్యాధికారులు, అదనపు వైద్యాధికారులు, డీఎంవో, మెడికల్ అధికారి, ఎంపీహెచ్‌వో, ఎస్‌పీహెచ్‌వో, డీఈవోలతో ప్రభుత్వం 105 వాహనాల అమలుపై వర్క్‌షాప్ నిర్వహించింది. పక్షం రోజులకోసారి గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఆశ్రమాల్లో 105 వాహన సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేది నిర్ణయం.
గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించి రెండేళ్లు కావస్తున్నా ఎలాంటి చర్యలు కానరావడం లేదు. 105 వైద్య సేవల కోసం ఉట్నూర్ సీహెచ్‌ఎన్‌సీవో(కమ్యూనిటీ హెల్త్ న్యూట్రీషియన్ క్లస్టర్ ఆఫీస్) పరిధిలో 14 ఆశ్రమాలు, జైనూర్ సీహెచ్‌ఎన్‌సీవో పరిధిలోని 13 ఆశ్రమాలు, ఆసిఫాబాద్, బోథ్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిర్పుర్-టీ సీహెచ్‌ఎన్‌సీవోల పరిధిలో ఒక్కో సీహెచ్‌ఎన్‌సీవోలో 12 ఆశ్రమ పాఠశాలల చొప్పున పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 99 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 27,861 మంది విద్యార్థులకు వైద్య సౌకర్యాలు అందించాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకున్నా చర్యలు శూన్యం.
నాలుగు వాహనాలతో సేవలు
మొదటి విడత నాలుగు 105 వాహనాలు జిల్లాకు రానున్నట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. తర్వాత మరో నాలుగు వాహనాలు వస్తాయన్నారు. మొదటి విడత వాహనాలు ఉట్నూర్, ఆదిలాబాద్, ఆ సిఫాబాద్, తిర్యాణి లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా అధికారు లు నిర్ణయం తీసుకున్నారు. వాహనాలు ఏ సమయంలో ఎక్కడ ఉన్న యో తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ విధానంలో జీపీఎస్ పద్ధతి ద్వారా రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యాలయం, స్థానిక ఐటీడీఏకు అనుసంధానం చేయడం నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు ఉంటాయని అధికారులు ప్రకటించారు.
పీహెచ్‌సీ మాదిరిగా 105 ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు అందుతాయన్నారు. ఇందు కోసం ప్రతీ వాహనం లో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ఏఎన్‌ఎం, కౌన్సిలర్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌లు ఉండేలా చూస్తామన్నారు. పక్షం రోజులకోసారి గుర్తించిన ఆశ్రమాలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య స్థితిని అంచనా వే సి అవసరమైతే అదే వాహనంలో ఆస్పత్రులకు తరలించేలా చూస్తామన్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిఆరోగ్య స్థితిని విద్యార్థులకు ఇచ్చి న జవహర్ ఆరోగ్య రక్ష కార్డుల్లో నమోదు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 105 వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎప్పుడు వస్తాయో తెలియదు.. - ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అదనపు వైద్యాధికారి ఉట్నూర్
రెండేళ్ల క్రితం ఆశ్రమ పాఠశాలల్లో 105 వాహనాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఉన్నతాధికారుల నుంచి అదేశాలు రావడంతో నివేదికలు సమర్పించాం. అలాగే గుర్తించిన ఆస్పత్రుల్లో విద్యార్థుల కోసం ఐదు పడకలతో ప్రత్యేక వార్డులు ఉంటాయన్నారు.
105 సేవలు కల
Published Wed, Sep 24 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement
Advertisement