ఆరునెలలుగా... 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి
అభం శుభం తెలియని వయసు వారిది..చిరుతిండి కొనిస్తేనే మన బుగ్గపై ఇంత ముద్దిచ్చి సంబరపడిపోయే అమాయకత్వం... కపటం..కల్మశం లేకుండా ఆడుతూ..పాడుతూ అల్లరిచేస్తూ సాగిపోయే వారి జీవితాలు కామాంధుల చేతుల్లో నలిగిపోయాయి. ఇద్దరు బాలికపై నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడిన కామాంధులు విషయం బయటపడే సరికి మెల్లగా జారుకోగా...ఏం జరిగిందో..ఏం జరుగుతుందో తెలుసుకోలేని వయసులో గర్భం దాల్చడంతో బాలికల జీవితాల్లో ఇప్పుడు చీకట్లు అలుముకున్నాయి.
ఇందూరు: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాందుడు అభం శుభం తెలియని ఓ 12 ఏళ్ల బాలికను లోబరుచుకుని ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చిన విషయం తెలియగానే నిందితుడు పరారయ్యాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది.
నందిపేట మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ భర్త అయిన శ్రీనివాస్‌గౌగ్ ఆ బాలికను పరిచయం చేసుకోని లోబర్చుకున్నాడు. గత నెలలుగా ఆరునెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే గత ఏడాది డిసెంబర్ 31న గుర్తు తెలియని వ్యక్తులు మైనర్ బాలికకు పెళ్లి చేస్తున్నారని 1098కు సమాచారం రావడంతో జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు పెర్కిట్ గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తండ్రి చనిపోగా తల్లికి కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు మైనర్ వివాహాన్ని నిలిపివేయించారు.
అయితే బాలిక ప్రవర్తపై అనుమానం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలిక మూడో నెల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఐసీపీఎస్ అధికారులు, ఆర్మూర్ సీడీపీఓ కలిసి నిందితుడైన శ్రీనివాస్‌గౌడ్‌పై ఆర్మూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్‌గౌడ్ పరారీలో ఉన్నాడు. ఇటు శ్రీనివాస్‌గౌడ్ భార్య కూడా కేసు నమోదు చేసింది. బాలికను ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని స్వధార్ హోంకు తరలించి వసతి కల్పించారు. సీడబ్ల్యూసీ కమిటీ, ఐసీడీఎస్ పీడీ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.