
విద్యుత్ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విద్యుత్ శాఖ ఉద్యోగులతో ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విద్యుత్ శాఖ ఉద్యోగులతో ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. విద్యుత్ శాఖలో కొత్తగా 17వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 24వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను త్వరలోనే క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పదోన్నతుల ప్రక్రియను నెలలోగా పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని కేసీఆర్ కోరారు.