19 అక్రమ కట్టడాల కూల్చివేత | 19, the demolition of illegal structures | Sakshi
Sakshi News home page

19 అక్రమ కట్టడాల కూల్చివేత

Jul 17 2014 1:22 AM | Updated on Sep 2 2017 10:23 AM

19 అక్రమ కట్టడాల కూల్చివేత

19 అక్రమ కట్టడాల కూల్చివేత

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. బుధవారం కాప్రా, ఉప్పల్, సైదాబాద్, ధూల్‌పేట, గుడిమల్కాపూర్, అంబర్‌పేట, ఆదర్శనగర్, రాజేంద్రనగర్, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, సీతాఫల్‌మండీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని 19 భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. గడచిన రెండు రోజులుగా మొత్తం 25 భవనాలను కూల్చివేశారు. ఎవరూ అక్రమ నిర్మాణాలకు పాల్పడవద్దని, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సులభంగా అనుమతులు మంజూరు చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement