చోరీ కేసులో రెండేళ్ల జైలు | 2 years imprisonment for theft case | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో రెండేళ్ల జైలు

Published Thu, Jun 4 2015 7:57 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

2 years imprisonment for theft case

నల్లగొండ టౌన్: చోరీ కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలడంతో రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ గురువారం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ రాధాకృష్ణమూర్తి తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సమ్మది ఆంజనేయులు 2014 జనవరి 8న పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలోని బొడ్డు విశ్వేశ్వర్ రావు ఇంట్లో చోరీ చేశాడు. ఆ చోరీలో తాళిబొట్టు, చేతి రింగుతో పాటు ఆభరణాలు దొంగింలించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ దూసరి భిక్షపతి కేసు దర్యాప్తు చేసి చార్జ్ షీట్‌ను కోర్టుకు సమర్పించాడు.  నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement