
బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట
కమాన్‌పూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్‌లో బడుగు బలహీన వర్గాలతో పాటు వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని టీబీజీకేఎస్ ప్రధానకారద్యర్శి మిర్యాల రాజిరె డ్డి అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టబడి ఉండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజల్లో ప్రజాధారణ పొందున్నాడన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం పేద ప్రజల అభ్యన్నతి కోసమే పనిచేస్తుం దన్నారు.
సింగరేణి కార్మికుల పిల్లల కోసం రామగుండంలో మెడికల్ కాలేజితో పాటు కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించడం అభినందనియమన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మే యర్ సాగంటి శంకర్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణా రెడ్డి,కిషన్‌రెడ్డి, ఇంతీయాజ్, పొన్నం శ్రీనివాస్, మార్త సుధాకర్, రెడ్డిశేఖర్, సది పాల్గొన్నారు.