వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం | 2019 Elections Black Congress President Arun Kumar Deshmukh | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం

Published Fri, Apr 27 2018 8:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

2019 Elections Black Congress President Arun Kumar Deshmukh - Sakshi

మాట్లాడుతున్న అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌

హుజూర్‌నగర్‌ : రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం తధ్యమని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌ అన్నారు. గురువారం స్థానికంగా జరిగిన బ్లాక్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  దేవిశెట్టి రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి గుజ్జుల శ్రీనివాసరెడ్డి, వంకాయల నర్సింహారావు, రేపాకుల కోటయ్య, ఇరిగెల రామకృష్ణారెడ్డి, బాలాజీనాయక్, సాముల వెంకటేశ్వరరెడ్డి, బండ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement