‘గాంధీ’ నుంచి హోం క్వారంటైన్‌కు 310 మంది | 310 members Sent To The Home Quarantine From Gandhi Hospital | Sakshi
Sakshi News home page

‘గాంధీ’ నుంచి హోం క్వారంటైన్‌కు 310 మంది

Published Tue, Jun 9 2020 4:06 AM | Last Updated on Tue, Jun 9 2020 4:06 AM

310 members Sent To The Home Quarantine From Gandhi Hospital - Sakshi

గాంధీఆస్పత్రి: కరోనా బాధితులను హోంక్వారంటైన్‌కు తరలించేందుకు గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. రోజూ వం దల సంఖ్యలో పాజిటివ్‌ రోగులు వచ్చి చేరటంతో నోడల్‌ కేంద్రమైన సి కింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిబంధనలకు అనుగుణంగా కరోనా పాజిటివ్‌ ఉన్నప్పటికీ మూడ్రోజుల పాటు లక్షణాలు లేని 50 ఏళ్లలోపు వయస్సున్న వారిని హోం క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయిం చి 393 మందిని ఎంపిక చేశారు. వీరిలో 310 మంది ఇళ్లలో హోంక్వారంటైన్‌కు ఉండాల్సిన సదుపాయాలు, వసతులున్నట్లు గుర్తించారు. మిగిలిన 83 మందిని ఆయుర్వేద, నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రుల్లోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన కరోనా బాధితులను 3 బస్సులు, 30 అంబులె న్స్‌ల్లో తరలిస్తున్నామని గాంధీఆస్పత్రి సూపరిం టెండెంట్‌ రాజారావు చెప్పారు. బాధితుల చేతిపై హోంక్వారంటైన్‌ ముద్ర వేస్తున్నామని, ప్రత్యేకంగా రూపొం దించిన హోంఐసోలేషన్‌ కిట్లను అం దిస్తున్నామన్నారు. హోంక్వారంటైన్‌కు తరలించిన కరోనా బాధితుల్లో పోలీసు లు, పాత్రికేయులు, వైద్య సిబ్బంది ఉ న్నారని తెలిపారు. వీరు అస్వస్థతకు గురైతే కోవిడ్‌ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబ ర్‌కు సమాచారమివ్వాలని  సూచించా రు. ప్లాస్మాథెరపీతో ఐదుగురు బాధితులు కోలుకున్నారని, వీరిలో ఒకరి ని ఇటీవలే డిశ్చార్జి చేశామన్నారు. ఐసీయూలో ప్రాణాపాయస్థితిలో ఉన్న సుమారు 50 మందికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement