
భూ పంపిణీకి 696 ఎకరాలు
ఇందూరు: జిల్లాలో దళితులకు భూపంపిణీ కోసం 696 ఎకరాలు కొనుగోలు చేశామని కలెక్టర్ యోగితారాణా తెలి పారు. సాగుకు యోగ్యమైన భూమిని దళితులకు పంపి ణీ చేసేందుకు క్షేత్రాస్థాయిలో పరిశీలించి, భూయజ మానులతో చర్చించి పారదర్శకంగా భూమిని కొనుగో లు చేస్తున్నట్లు చెప్పారు. భూ పంపిణీ, ఆర్థిక సహాయ పథకాల ప్రగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులకు భూపంపిణీ కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.
జిల్లాకు నిర్దేశించిన 717 ఎకరాల లక్ష్యానికి మించి అదనంగా 300 ఎకరాలను పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న కలెక్టర్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పారు. ఆర్థిక సహాయ పథకం కింద 22 వేల దరఖాస్తులు అందాయని కలెక్టర్ వివరించారు. వాటిలో 17 వేల దరఖాస్తులను సక్రమంగా ఉన్నట్లు స్క్రూటినీలో గుర్తించామని, వారిలో 1:4 దామాషాలో రుణ మంజూరుకు బ్యాంకర్లకు పంపనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు కార్యాచరణను ప్రకటించామన్నారు. 29లోపు యూనిట్ల మంజూరుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని, మార్చి 2లోపు లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు వివరించారు.
మార్చి రెండో వారంలోపు యూనిట్లను గ్రౌండింగ్ చేస్తామన్నారు. అలాగే, ముద్రా బ్యాంకు రుణాల ద్వారా 8 వేల మంది లబ్దిదారులకు రూ.95 కోట్ల విలువైన యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్య కార్యదర్శి టి.రాధ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఏజేసీ రాజారాం, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఈడీలు విజయ్‌కుమార్, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి విమలాదేవి తదితరులు పాల్గొన్నారు.