
రెడ్ల సమరభేరికి హాజరైన రెడ్డి కులస్తులు(ఇన్‌సెట్లో హాజరైన ప్రజలు)
హైదరాబాద్ : రెడ్డి కులస్తులను రోడ్ల మీదకు తీసుకువచ్చింది పాలక వర్గాలేనని గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెడ్ల సమరభేరి కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ మాట్లాడుతూ..80 శాతం రెడ్లు నిరుపేదలేనని వ్యాఖ్యానించారు. విద్య, ఉద్యోగాల్లో రెడ్లకు తీరని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రెడ్లతో పాటు బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, వెలమ, ఇతర అగ్ర కుల నిరుపేదలందరికీ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈబీసీ కుటుంబాలకు విద్య, ఉద్యోగాల్లో న్యాయం చేసే విధంగా రాహుల్ గాంధీకి విన్నవించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపర్చారని పేర్కొన్నారు. కులమే రెడ్డిలకు శత్రువని రెడ్డి పేదలు నిరుత్సాహంతో ఉన్నారని చెప్పారు. రెడ్ల సమరభేరికి మా పార్టీ తరపున పూర్తి మద్ధతు ఇస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment