
పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు
కరీంనగర్, హైదరాబాద్ జూబ్లీ కార్యాలయాల్లో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆధార్–పాన్ కార్డుల అనుసం దానం ఇప్పుడు తప్పని సరైంది. రెండింటిపై ఉండే పేర్లలో స్వల్ప తేడాలుండటంతో ఇప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఆధార్‌కార్డుల్లో వివరాలు మార్చుకునే వెసులుబా టును పోస్టల్ శాఖ అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప టికే కరీంనగర్, హైదరాబాద్ పాతబస్తీలోని జూబ్లీ తపాలా కార్యాలయాల్లో ఆధార్ అప్‌గ్రెడేషన్ కేంద్రా లను ప్రారంభించింది. త్వరలో అన్ని హెడ్ పోస్టా ఫీసుల్లో, ఆ తర్వాత అన్ని తపాలా కార్యాల యాల్లో ప్రారంభించనుంది.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కూడా..
దేశవ్యాప్తంగా ఆధార్‌కార్డుల జారీ జరిగినా ఇప్ప టికీ ఆధార్‌కార్డు పొందని కుటుంబాలున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసినా వాటిని ఎత్తేసి, మీ–సేవా కార్యాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నట్లు ప్రకటిం చింది. కానీ చాలా సెంటర్లలో ఆధార్ కార్డుల ఎన్‌రోల్‌మెంట్ జరగట్లేదు. కొత్తగా ఆధార్ కార్డు పొందాలనుకునే వారికి పోస్టాఫీసులు ప్రత్యేక కేంద్రాలు ఏర్పా ట్లు చేస్తున్నాయి. యూ ఐడీఏఐ విభాగంతో తపాలా శాఖ ఒప్పం దం కుదుర్చు కుంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టేందేం దుకు సిబ్బందిని ఎంపిక చేసేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. అందులో ఉత్తీర్ణులయ్యే తపాలా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు ఇస్తారు. జీవన్ ప్రమాణ్ అనే తపాలా పథకం కోసం ఇప్పటికే ప్రధాన పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చుకున్నారు. వాటినే ఆధార్ కార్డుల కోసం వినియోగించనున్నారు.