రేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
కామారెడ్డి (నిజామాబాద్) : రేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. మండలంలోని లింగాయపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ పెద్దిరాములు రేషన్ సరుకుల రిలీజ్ ఆర్డర్ కోసం డిప్యూటీ తహశీల్దార్ జి. బాలయ్యను సంప్రదించాడు.
అయితే ఆయన అందుకు రూ. 2 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రేషన్ డీలర్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు.