ఆర్‌ఐ అంజయ్యను ప్రశ్నిస్తున్న డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్, వృత్తంలో బాధిత రైతు మహేందర్, పట్టుకున్న డబ్బులు
పహణీలో పేరు ఎక్కించేందుకు లంచం డిమాండ్
రూ.4 వేలు తీసుకుంటుండగా పట్టివేత
సైదాపూర్, న్యూస్‌లైన్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కిం ది. పహణీలో పేరు ఎక్కించేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... ఘనపూర్‌కు చెందిన గుంటి మహేందర్ అనే రైతుకు 253 సర్వేనంబర్‌లో 3.06 ఎకరాల భూమి ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నా కంప్యూటర్ పహణీలో మాత్రం పేరు నమోదు కాలేదు. పహణీలో నమోదు చేయాలని మూడు నెలల క్రితం తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
కేసు నమో దు చేసి ఆర్‌ఐని అరెస్టు చేశారు. ఆదివారం రి మాండ్‌కు పంపనున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ రెవెన్యూశాఖలో అవినీతి బాగా పెరిగిపోయిం దని, దాడులు చేసి ఎంతమందిపై కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రావడం లేదని అన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
గృహనిర్మాణ శాఖలోనూ అవినీ తిపరులు పెరిగిపోయారని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన సెల్ : 9440446150, సీఐ సెల్: 9440446139 నంబర్ల లో ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. మెసేజ్ చేసినా స్పందిస్తామన్నారు.దాడుల్లో సీఐలు వి.వి.రమణమూర్తి, జి.శ్రీనివాసరాజు, వేణుగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు.