అరగుండు, అర మీసంతో బండి మధు, మందుల మల్లయ్య
సాక్షి, మోత్కూరు/అడ్డగూడూరు : ప్రచారంలో వినూత్నమిది. తమ అభిమాన అభ్యర్థులను గెలిపిం చుకునేందుకు కార్యకర్తలు ప్రచారంలో కొత్తపుం తలు తొక్కుతున్నారు. అలాంటి ఘటనలే తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్నా యి. ఒకరు టీఆర్‌ఎస్ గెలవాలని, మరొకరు కాంగ్రెస్ గెలవాలని అరగుండు, అరమీసంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అద్దంకి దయాకర్ గెలవాలని కోరుతూ లక్ష్మీదేవి కాల్వ గ్రామానికి చెందిన బండి మధు అనే కార్యకర్త అరగుండు, అరమీసంతో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆదివారం మోత్కూరు మండలంలో బుజిలాపురం, రాగిబావి, ముశిపట్ల ,అనాజిపురం, పనకబండ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పర్యటించగా, ఆయన ప్రచారంలో అరగుండు అరమీసంతో మధు ఆకర్షణగా నిలిచాడు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌గెలవాలని..
టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌ను గెలిపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన మందుల మల్లయ్య అరగుండు, అరమీసంతో ప్రచారం ని ర్వహించాడు. లక్ష్మిదేవికాల్వ, ధర్మారంలో టీఆ ర్‌ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ప్రచారంలో అతను అరగుండు, అరమీసంతో ఓటర్లను ఆకర్షించాడు.
Comments
Please login to add a commentAdd a comment