బియ్యం పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌లోని మోర్ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన బియ్యంలో కల్తీ వచ్చాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వినియోగదారుడు సోమవారం ఆందోళనకు దిగాడు. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కర్నె శ్యాంసన్ కథనం ప్రకారం. జ్యోతినగర్‌లోని మోర్‌సూపర్ మార్కెట్‌లో శ్యాంసన్ ఇటీవల 25 కిలోల బియ్యం కొనుగోలు చేశాడు. అవి తిన్నప్పటి నుంచి పిల్లలు కడుపునొప్పి వస్తుందని తరచూ అంటున్నారని తెలిపారు.
సోమవారం శ్యాంసన్ కుమారుడికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో అన్నాన్ని పరిశీలించిగా కల్తీ జరిగిందని గుర్తించారు. నేరుగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లి నిర్వాహకులను నిలదీశాడు. పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఫుడ్‌సేప్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఫుడ్‌సేప్టీ అధికారి రాజేంద్రనాథ్ సూపర్‌మార్కెట్‌కు వచ్చి వినియోగదారుడు శ్యాంసన్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సూపర్ మార్కెట్‌లోని బియ్యం షాంపిల్స్ సేకరించుకొని వెళ్లారు. పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించి కల్తీ జరిగిందని తెలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment