
అలంపూర్ కోటపై జోగుళాంబ విగ్రహం
అలంపూర్‌రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ పుణ్యక్షేత్రంలోని తుంగభద్రానది తీరాన వంద అడుగుల ఎత్తున్న కోటపై చిన్నగూట్లో జోగుళాంబ విగ్రహాన్ని సోమవారం కొందరు భక్తులు కనుగొన్నారు. దీంతో ఓ భక్తుడు నిచ్చెన సాయంతో పైకి ఎక్కి విగ్రహా న్ని పసుపు, కుంకుమలతో అలంకరించాడు. కోటపై విగ్రహం బయటపడడంతో దానిని చూసేందుకు భక్తులు ఎగబడుతున్నారు. ఆ విగ్రహం కింది భాగంలో గజ వాహనంపై ఉన్న మరో విగ్రహం కూడా కనిపిస్తోంది. అయితే ఆ విగ్రహం ఎవరిది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.