చట్టసభల్లో దూషించుకోవొద్దు:కేసీఆర్ | all parties mla,mlc will participate on budget discussion | Sakshi
Sakshi News home page

చట్టసభల్లో దూషించుకోవొద్దు:కేసీఆర్

Published Sun, May 3 2015 7:42 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

చట్టసభల్లో దూషించుకోవొద్దు:కేసీఆర్ - Sakshi

చట్టసభల్లో దూషించుకోవొద్దు:కేసీఆర్

నల్లగొండ : చట్టసభల్లో దూషించుకోవడం, కొట్టుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు చట్టసభల్లో జరగడం మంచిది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్లోని విజయ విహార్లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. సభలో ఏ సభ్యుడైనా బిల్లు ప్రవేశపెట్టే హక్కు ఉందన్నారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నపుడు సీహెచ్ విద్యాసాగర్ రావు బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

బడ్జెట్ వంటి అంశాలపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఎంఎల్ఏ,ఎంఎల్సీ లు చర్చల్లో పాల్గొనాలన్నారు. ఈ అంశం పై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రత్చేక శిక్షణ ఇస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement