
మనకు తెలిసింది కొంతే..తెలుసుకోవావాల్సింది చాలా..
నల్లగొండ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నిత్య విద్యార్థిలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్లోని విజయ విహార్లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. జీవితం చాలా చిన్నదని, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
పదవులు శాశ్వతం కాదని, మనకే అన్ని తెలుసనుకుంటే పొరపాటేనని కేసీఆర్ అన్నారు. మనకు తెలిసింది కొంతే అని తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి...ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకరోజు పాటు శిక్షణా తరగతి ఉంటుందని కేసీఆర్ తెలిపారు.