ఎస్సీ, ఎస్టీలకు 45శాతం మార్కులు ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం జీఓ జారీచేశారు. డైట్‌సెట్ రాసే (డీఈఈ సెట్) జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 50 శాతం మార్కులు ఉండాలని గతంలోనే పేర్కొన్నా.. ఇక ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కూడా 45 శాతం మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ఉత్తర్వుల్లోని మరిన్ని సవరణలు
- మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థి కచ్చితంగా డీఈఈసెట్‌లో ర్యాంకు సాధించాలి.
- మైనారిటీ కాలేజీ యాజమాన్యాలు రెగ్యులర్ కౌన్సెలింగ్‌లో కాకుండా తాము ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటే నిర్ణీత గడువులోగా మైనారిటీ హోదా సర్టిఫికెట్‌తో పాఠశాల విద్యా కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
- నాన్‌మైనారిటీ విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయిన సీట్ల వివరాలను 15రోజుల్లోగా డీఈఈసెట్ కన్వీనర్‌కు తెలియజేయాలి.
- మైనారిటీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయాల్సిన పూర్తి బాధ్యత కన్వీనర్‌దే.
- భర్తీ అయినవి, మిగులు సీట్ల వివరాలు అన్నీ జూలై రెండో వారం నుంచి నాలుగో వారంలోగా సంబంధిత అధికారులు నివేదించాలి.
డీఎడ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో సవరణలు
Published Fri, May 30 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement