రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూకుంభకోణం కేసులో ప్రభుత్వం ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్సన్ వేటు వేసింది
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూకుంభకోణం కేసులో ప్రభుత్వం ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్సన్ వేటు వేసింది. బాలనగర్ సబ్‌రిజిస్ట్రార్ యూసఫ్, మేడ్చల్ సబ్‌రిజిస్ట్రార్ చంద్రారెడ్డి, కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మేడ్చల్ సబ్‌రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి, బాలనగర్ సబ్‌రిజిస్ట్రార్ యూసఫ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.