Sub-Registrars
-
ఫ్లాట్ అమ్ముతున్నారా? అయితే ఈ విషయాలు గమనించండి
ప్రశ్న: నేను హైదరాబాద్‌లో నా ఫ్లాట్‌ని అమ్ముతున్నాను. రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్లు మార్కెట్ విలువ రూ. 23,00,000 అంటున్నారు. – ఎ. సత్యప్రసాద్, హైదరాబాద్ జ. స్థిరాస్తుల క్రయవిక్రయ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇటు అమ్మే వ్యక్తి, అటు కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. ♦ ఎటువంటి పరిస్థితుల్లోనూ కాస్త వైట్, కాస్త బ్లాక్ జోలికి పోకండి. ♦ ఏ పరిస్థితుల్లోనూ నగదు వ్యవహారం వద్దు. ♦ నగదు తప్పనిసరి అయితే రూ. 2,00,000 లోపలే ఉండేలా చూసుకోండి. ♦ 2001 ఆర్థిక సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి విలువ 01-040-2001 నాటి మార్కెట్ విలువను ప్రామాణికంగా ఫెయిర్ మార్కెట్ విలువగా తీసుకుంటారు. జాగాకి గజం ఇంత అని, చదరపు అడుగుకు ఇంత అని సబ్–రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ఇస్తారు. ♦ అలా నిర్ధారించిన విలువను ఇండెక్సింగ్ ద్వారా పెంచుతారు. 2001-02 నుండి 2002–03 వరకు ఒక టేబుల్ ఆన్లైన్లో దొరుకుతుంది. ♦ ఉదాహరణకు 2001–02లో మార్కెట్ విలువ 100 అనుకుంటే అది ఇప్పుడు 331కి సమానం అవుతుంది. మీరు గతంలో ఎంతకు కొన్నా 01–04–2001 నాటు మార్కెట్ విలువ రూ. 5,00,000 అనుకోండి 5,00,000/100 X331 = రూ. 16,55,000గా భావిస్తారు. ♦ పైన లెక్కించిన రూ. 16,55,000ని కొన్న ధరగా పరిగణిస్తారు. ♦ ఒప్పందంలో ఉన్న మొత్తం, మార్కెట్ విలువ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అమ్మకపు విలువుగా పరిగణిస్తారు. మీరు చెప్పిన కేసులో ఒప్పందపు విలువ రూ. 18,00,000, సబ్–రిజిస్ట్రార్ కట్టిన విలువ రూ. 23,00,000. సబ్–రిజిస్ట్రార్ విలువనే పరిగణిస్తారు. కొనే వ్యక్తి దీని మీదే రిజిస్ట్రేషన్ రుసుం, వగైరాలు చెల్లించాలి. ♦ ఈ ప్రకారం రూ. 23 లక్షలను ప్రాతిపదికగా తీసుకుని, అందులో నుంచి రూ. 16,55,000ని తీసివేయగా మిగిలిన రూ. 6,45,000ని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు. ♦ మీరు నిజంగా రూ. 18,00,000లే తీసుకున్నా, ఆ మేరకు అన్ని సాక్షాలు ఉన్నప్పటికీ రూ. 23,00,000నే పరిగణనలోకి తీసుకుంటారు. ♦ సాధారణంగా ఒప్పందం విలువ ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది. ఆ అదనపు మొత్తం నగదుగా తీసుకుంటూ ఉంటారు. అలా ససేమిరా చేయవద్దు. కొంత మంది అదనపు మొత్తాన్ని విడిగా నాలుగైదు చెక్కులుగా ఇస్తాం.. మీరు వేరే అకౌంటులో వేసుకోండి అంటూ ఉంటారు. అలాంటివి చేయొద్దు. ♦ మీరు ఎలా అయితే క్యాపిటల్ గెయిన్కి గురి అవుతారో అలాగే ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి సదరు మొత్తానికి ’సోర్స్’ చూపించాలి. అలా చూపించకపోతే ఆ మొత్తం మీద 30 శాతం పన్ను చెల్లించాలి. ♦ ‘ఇద్దరం లబ్ధి పొందాలి, ఉభయతారకంగా ఉండాలి‘ అని ఆలోచించకండి. నల్లధనంపై ఉంది ఆంక్ష .. కొంత మంది పెడతారు పరీక్ష .. కానీ మనకు పడేను శిక్ష .. మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష! స్థిరాస్తి క్రయవిక్రయాల్లో .. జాగ్రత్త -
మేడ్చల్ సబ్‌రిజిస్ట్రార్ అరెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూకుంభకోణం కేసులో ప్రభుత్వం ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్సన్ వేటు వేసింది. బాలనగర్ సబ్‌రిజిస్ట్రార్ యూసఫ్, మేడ్చల్ సబ్‌రిజిస్ట్రార్ చంద్రారెడ్డి, కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మేడ్చల్ సబ్‌రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి, బాలనగర్ సబ్‌రిజిస్ట్రార్ యూసఫ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
ఎనీవేర్ దెబ్బ..!
ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు ఒకరి అరెస్టు సిటీ బ్యూరో: ఎనీవేర్ దందాలో మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ గురై క్రిమినల్ కేసు నమోదు కాగా, తాజాగా ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసి ప్రస్తుతం మేడ్చల్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న రమేష్ చంద్రారెడ్డి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్‌లు సస్పెండ్ అయ్యారు. మరోవైపు రమేష్ చంద్రారెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టిన ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. రమేష్ చంద్రారెడ్డి అక్రమాలు ఇలా... నాగోలు: ప్రస్తుతం మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న రమేష్ చంద్రారెడ్డి రెండేళ్ల క్రితం ఎల్బీనగర్ సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎల్బీనగర్ డాక్టర్స్ కాలనీకి చెందిన మూడు డాక్యుమెంట్లను, సౌత్ ఇండియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన జి. సుబ్బరాజు, సామ కన్స్ట్రక్షన్స్ సామ నర్సింహ్మారెడ్డి స్థలాలను ప్రభుత్వం లెక్కప్రకారం గజం ధర రూ. 35 వేలు ఉండగా, రూ. 13 వేలకు తగ్గించి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో స్టాంపు డ్యూటీ కింద ప్రభుత్వానికి రావాల్సిన రూ.1.45 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ రిజిస్ట్రార్ టి.సుబ్బరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో రమేష్ చంద్రారెడ్డిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎల్బీనగర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్రావు తెలిపారు. యూసుఫ్ అక్రమాలు ఇలా... నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మదీనగూడ (సర్వే నెం. 162,163) ప్రాంతంలో బీహెచ్ఈఎల్ ఎగ్జిక్యూటివ్ హౌసింగ్ సొసైటీ.. ‘మానస బీహెచ్ఈఎల్ ఎగ్జిక్యూటివ్ టవర్స్’ను నిర్మించింది. నిబంధనల ప్రకారం సదరు ప్లాట్లను రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది, ఎనీవేర్ వెసులుబాటుతో పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 2016లో రిజిస్ట్రేషన్ చేశారు. మరోవైపు కోఆపరేటివ్ సొసైటీలకు మాత్రమే జీవో నెం.472 ద్వారా స్టాంప్‌డ్యూటీ మినహాయింపు వర్తిస్తుంది. బీహెచ్ఈఎల్ ఎగ్జిక్యూటివ్ హౌసింగ్ సొసైటీకి కో–ఆపరేటవ్ స్టేటస్ లేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ స్టాంప్‌డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. 90 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయడంతో సుమారు .రూ.కోటిన్నర మేర రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడింది. దీంతో మరో రెండు మూడు ఆరోపణలు రావడంతో యూసుఫ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. -
రిజిస్ట్రేషన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. శాఖల మధ్య సమన్వయం కొరవడింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం అవసరమైన కన్వేయన్స్ డీడ్లను మాన్యువల్‌గానే జారీ చేయాలని ప్రభుత్వం గత నెల 27న ఆదేశాలు జారీ చేసినా, భూపరిపాలన విభాగం అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. తాము కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో జారీ అయిన కన్వేయన్స్ డీడ్లనే రిజిస్ట్రేషన్లకు వినియోగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, తహసీల్దార్లను సీసీఎల్ఏ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. ఒకే అంశంపై సర్కారు ఒకరకంగా, సీసీఎల్ఏ మరో విధంగా ఆదేశాలివ్వడంతో ఏ ఆదేశాలను అమలు చేయాలో పాలుపోక జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు. కన్వేయన్స్ డీడ్‌లోని వివరాలను అవసరమైనట్లు మార్పు చేసేందుకు సీసీఎల్ఏ అవకాశం ఇవ్వకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మరింత జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. జీవో 59 కింద కన్వీయన్స్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేసే విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన నిబంధనలు ఏవీ అందలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. కబ్జా అయిన ప్రభుత్వస్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబరులోనే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర కిందే చెల్లింపు కేటగిరీ కింద 50వేల దరఖాస్తులు సర్కారుకు వచ్చినా నేటికీ ఒక్క దరఖాస్తుకు మోక్షం కలిగించలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
రిజిస్ట్రేషన్లకూ ఎలక్ట్రానిక్ సంతకం
దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యానికి ఇకపై చెక్ సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఏర్పడుతోన్న జాప్యాన్ని నివారించేందుకు స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల విభాగం కొత్త ఆలోచన చేస్తోంది. రిజిస్ట్రేషన్ సందర్భంగా క్రయ, విక్రయదారుల పొటోలను తీసుకునే సమయంలోనే వారితో ఎలక్ట్రానిక్ పాడ్‌పై సంతకాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కో రిజిస్ట్రేషన్‌కు పట్టే సమయంలో కనీసంగా 20 నుంచి 30 నిమిషాల జాప్యాన్ని నివారించొచ్చు. ముఖ్యంగా నగర పరిధిలో రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పద్ధతిని అవలంభిస్తే వినియోగదారులకు వేగంగా పనవుతుందని సబ్ రిజిస్ట్రార్లు అంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకొన్న ఇంటర్నెట్ సమస్యల కారణంగా ప్రస్తుతం ఒక్కో దస్తావేజును స్కాన్ చేసి అప్లోడ్ చేసేందుకు అరగంట నుంచి గంటకుపైగా సమయం పడుతోందని.. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే దస్తావేజుల వెనుకవైపు క్రయ విక్రయదారులు సంతకం చేయాల్సి ఉన్నందున వారికి నిరీక్షణ తప్పడం లేదంటున్నారు. ప్రస్తుతం రవాణా శాఖలో డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్ నిమిత్తం వినియోగదారుల నుంచి ఎలక్ట్రానిక్ పాడ్లపై సంతకాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్నే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఎలక్ట్రానిక్ సంతకాలకు చట్టబద్ధత లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. కోర్టు కేసుల్లో దస్తావేజులపై ఉన్న ఎలక్ట్రానిక్ సంతకాలను న్యాయమూర్తులు ఏ మేరకు అంగీకరిస్తారన్నదానిపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. సబ్ రిజిస్ట్రార్లకు బయోమెట్రిక్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ లేకున్నా సిబ్బంది రిజిస్ట్రేషన్ తంతును పూర్తి చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు తీరిగ్గా ఆఫీసులకు వచ్చి అప్పటికే సిద్ధంగా ఉన్న దస్తావేజులపై చూసీ చూడకుండా సంతకాలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలోనే.. దస్తావేజులపై సబ్ రిజిస్ట్రార్ సంతకం చేసే సమయంలో బయోమెట్రిక్ యంత్రంపై వేలుముద్ర వేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ బయోమెట్రిక్ విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వినియోగదారుల గుర్తింపులో ఆధార్‌ను వినియోగించుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. -
‘ఊరూరా రిజిస్ట్రేషన్ స్టాంపులు’ సక్సెస్
♦ పోస్టాఫీసుల్లో స్టాంపుల విక్రయాలకు మంచి స్పందన ♦ రెండు నెలల్లో రూ.4 కోట్ల విలువైన స్టాంపుల విక్రయం ♦ త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఊరూరా రిజిస్ట్రేషన్ స్టాంపులు’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించింది. ప్రస్తుతం 80 మున్సిపాల్టీల్లోని పోస్టాఫీసుల ద్వారా రెండు నెలల్లో సుమారు రూ.4 కోట్ల విలువైన స్టాంపులను విక్రయించినట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా పోస్టాఫీసుల ద్వారా స్టాంపుల విక్ర యాన్ని సెప్టెంబర్ 1న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని తొలిదశలో పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసిన అధికారులు త్వరలోనే మండల కేంద్రాల్లోని పోస్టాఫీసుల్లోనూ ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. ఆపైన ప్రతి గ్రామంలోనూ స్టాంపుల విక్రయాలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రారంభించిన కొన్ని సేవలు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. ఆయా సేవలను సమర్థవంతంగా అందించేందుకు క్షేత్రస్థాయిలో సరైన సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, విస్తృత ప్రచారం నిర్వహించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో వినియోగదారులకు ఉపకరించని కొన్ని సేవల వివరాలు ఇలా ఉన్నాయి. నిరుపయోగంగా ఇంటరాక్షన్ సేవలు.. నవీకరించిన వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఇంటరాక్ట్ కావచ్చని గతంలో అధికారులు ప్రకటించారు. అయితే.. వినియోగదారులు ఆన్లైన్లో నమోదు చేసిన సందేహాలను నివ ృత్తి చేసే వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయలేదు. సందేహాలను నమోదు చేయడంపై వినియోగదారులకు గానీ, వాటిని పరిష్కరించాల్సిన అధికారులకు గానీ ఏ విధమైన అవగాహనా కల్పించలేదు. పని చేయని ఎస్ఎంఎస్ వ్యవస్థ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్‌ను సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) రూపంలో వినియోగదారుని మొబైల్‌కు అందాల్సి ఉంది. అయితే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఈ పక్రియ అమలుకు నోచుకోవడం లేదు. స్లాట్ బుకింగ్‌కు ఆదరణ కరవు ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరీక్షించాల్సిన పనిలేకుండా.. వెబ్‌పోర్టల్ ద్వారానే ముందుగా స్లాట్(పలానారోజు, సమయం)ను బుక్ చేసుకునే సదుపాయానికి కూడా వినియోగదారుల నుంచి ఆదరణ లభించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఒకట్రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు అంతగా లేవు. దీంతో వినియోగదారులు ఎప్పుడు కుదిరితే అప్పడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చే యించుకుంటున్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తుల వివరాలను వెబ్ పోర్టల్‌లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ముందుగానే డేటాను ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ క్షణాల్లో పూర్తి అవుతుందని అధికారులు చెప్పారు. అయితే డేటా ఎంట్రీ ముందుగా చే స్తే, రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు ఉన్నాయంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇబ్బంది పెడతారేమోనని వినియోగదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
బ్లాక్ దందా!
సాక్షి, కొత్తగూడెం: భూ క్రయ విక్రయాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు స్టాంప్ పేపర్లు తప్పనిసరి. ఎక్కువగా ఉపయోగించే రూ.10, రూ.20 విలువైన బాండ ్ల కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. అందుబాటులో ఉన్నచోట కూడా బ్లాక్‌లో రూ.50 వరకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు స్టాంప్ వెండర్ల మాయాజాలంతో బాండ్ల కొరత ఏర్పడుతోంది. జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లందు, వైరా, మధిర, కల్లూరు పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం కార్యాలయాల పరిధిలో ఎక్కువగా స్టాంప్ పేపర్ల వినియోగం ఉంటుంది. భూ విక్రయాలు, విద్యార్థులకు ఆదాయ, కుల, లోకల్ ఏరియా ధ్రువీకరణ పత్రాలు, ఇతర అఫిడవిట్ల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ కార్యాలయాలకు వినియోగదారులు ఎప్పుడు వెళ్లినా స్టాంప్ పేపర్ల కొరత ఉందని సిబ్బంది సమాధానం చెబుతుండటం తో నిరాశతో వెనుదిరుగుతున్నారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100 బాండ్ పేపర్ల కోసం ప్రతి మూడునెలలకు ఒకసారి రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌కు ఇండెంట్ పెడతారు. అయితే ప్రతిసారి రూ.50, రూ.100 బాండ్ పేపర్లను ఇండెంట్ ప్రకారం పంపుతుండగా, రూ.10, రూ.20 పేపర్లలో మాత్రం కోత పెడుతున్నారు. దీంతో ఈ బాండ్ పేపర్లు దొరకక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ విలువ చేసే బాండ్లు కొనుగోలు చేయలేక.. తక్కువ ధర పేపర్లు ఎప్పుడొస్తాయో తెలియక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ పేపర్ల కొరత లేదని చెపుతుండటం గమనార్హం. తక్కువ ధర పేపర్ల కోసం నిత్యం ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. విసిగి వేసారిన వారు తప్పని పరిస్థితుల్లో ఎక్కువ విలువ చేసే బాండ్ పేపర్లనే కొనుగోలు చేస్తుండడంతో వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. స్టాంప్ వెండర్ల మాయాజాలం... బాండ్ పేపర్ల అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు జిల్లా వ్యాప్తం గా 118 మంది స్టాంప్ వెండర్లను నియమించారు. ఈ స్టాంప్‌ల విక్రయం ద్వారా ప్రభుత్వం వారికి 5 శాతం కమీషన్ ఇస్తుంది. జిల్లాకు వచ్చిన వాటిలో 80శాతం పేపర్లను స్టాంప్ వెం డర్లకే ఇచ్చి మిగిలినవి మాత్రమే కార్యాలయా ల్లో విక్రయిస్తుండడంతో కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా స్టాంప్ వెండర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో రూ.10, రూ.20 బాండ్ పేపర్లను రూ.30 నుంచి 50వరకు విక్రయిస్తున్నా రు. చండ్రుగొండ, ఏన్కూరు, జూలూరుపాడు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం, మణుగూరు, ఇల్లందు తదితర ప్రాంతాల్లోని స్టాంప్ వెండర్లు ఈ వ్యవహారానికి తెరలేపారనే ఆరోపణలున్నాయి. ఎక్కువ కమీషన్ వస్తుం దనే ఉద్దేశ్యంతో తక్కువ ధర ఉన్న స్టాంప్ పేపర్ల కొరత సృష్టించి ఎక్కువ విలువైన పేపర్లను విక్రయిస్తున్నారని సమాచారం. రూ.లక్షల్లో ‘బ్లాక్’ ఆదాయం.. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.3 లక్షల విలువైన స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్నారు. అంటే సెలవురోజులు మినహాయిస్తే స్టాంప్ వెండర్లు, కార్యాలయాల్లో కలిపి నెలకు సగటున రూ.75 లక్షల వరకు పేపర్ల విక్రయం ఉంటుంది. ఇందులో తక్కువ విలువ చేసే రూ.10, రూ.20 స్టాంప్ పేపర్లను నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు స్టాంప్ వెండర్లు విక్రయిస్తారు. ఈ పేపర్లను అసలు ధరకంటే రెండుమూడు రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తూ రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అక్రమ ఆదాయం అర్జిస్తున్నారు. స్టాంప్ వెండర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. పర్యవేక్షించాల్సిన సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మా దృష్టికి రాలేదు.. : రామలింగం, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం జిల్లాలో స్టాంప్ పేపర్లు కొరత, బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఎక్కడా కొరత మాత్రం లేదు. ఎప్పటికప్పుడు ఏయే స్టాంప్ పేపర్లు కావాలో కమిషనరేట్‌కు ఇండెంట్ పంపించి తెప్పిస్తున్నాము. ఎక్కడైనా కొరత ఉన్నా.. బ్లాక్‌లో విక్రయించినా వినియోగదారులు మా దృష్టికి తీసుకురావాలి.