సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని చెరువుల్లో రూ.67.12కోట్లతో పనులను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులతో 20,346 ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిన రూ.130కోట్లతో కలుపుకుంటే ఇప్పటివరకు రూ.197 కోట్ల పనులకు పరిపాలనా ఆమోదం లభించినట్లైంది. ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మెదక్ జిల్లాలో 64 చెరువులకు రూ.9.70కోట్లు, రంగారెడ్డిజిల్లాలో 108చెరువులకు రూ.26.44కోట్లు, కరీంనగర్ జిల్లాలో 12 చెరువులకు 4.34కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 25 చెరువులకు రూ.5.74కోట్లు, వరంగల్‌లో 22 చెరువులకు 5.95కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 34 చెరువులకు 14.95కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తన ఉత్తర్వుల్లో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి పేర్కొన్నారు.
మణుగూరు విద్యుత్ ప్లాంటుకు గోదావరి నుంచి 1.40టీఎంసీల నీరు
ఖమ్మం జిల్లా మణుగూరు మండలం, రామానుజవరంలో తెలంగాణ జెన్‌కో ఏర్పా టు చేయనున్న విద్యుత్ ప్లాంటుకు గోదావరి నుంచి ఏడాదికి 1.40టీఎంసీ ల నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది.
మిషన్ కాకతీయకు మరో రూ.67.12కోట్లు
Published Thu, Jan 8 2015 1:09 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement