చండీయాగానికి చకాచకా పనులు | Arrangements for Ayutha chandi yagam | Sakshi
Sakshi News home page

చండీయాగానికి చకాచకా పనులు

Published Sat, Dec 5 2015 5:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

Arrangements for Ayutha chandi yagam

-ఐదు రోజులపాటు ఆధ్యాత్మికంగా యాగం
-15 మంది ఋత్విక్కులు హాజరు
-వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు
-10 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు
-సిసి కెమెరాలు, టీవీల ఏర్పాటు
-ప్రతిరోజు 10 వేల నుండి 60 వేల మందికి భోజన ఏర్పాట్లు

జగదేవ్‌పూర్ (మెదక్ జిల్లా) : లోక కల్యాణం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఆయుత చండీయాగం అద్వితీయంగా జరపడానికి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం తన వ్యవసాయక్షేత్రంలో మహాక్రతువు న భూతో న భవిష్యతిగా జరిపేలా స్వయంగా అన్ని ఏర్పాట్లును పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ యాగం డిసెంబర్ 23 నుండి 27 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా జరగనుంది. ఈ నెల 27న సీఎం దంపతులు నవ చండీయాగంతో ఆయుత చండీయాగానికి భూమిపూజ చేశారు. నిర్వహణ బాధ్యతలను  బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేటికి 10 గ్యాలరీలు పూర్తి చేశారు. ఇంకా కొనసాగుతున్నాయి. పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతిరోజు బందోబస్తును నిర్వహిస్తున్నారు.

వ్యవసాయక్షేత్రంలో చండీయాగం పనులపై ప్రత్యేక కథనం...

శృంగేరి శారదాపీఠం శిష్యులు, పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వరశర్మ, బ్రహ్మశ్రీ ఫణిశశాంక్‌శర్మ, ఆచార్య బ్రహ్మలుగా వ్యవహరిస్తున్న చండీయాగంలో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి 15 వందల మంది బ్రహ్మణోత్తములు ఋత్విక్కులుగా పాల్గొంటారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి ష్టష్యభ్ధి పూర్తి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆయుత చండీయాగం సంప్రదాయానికి అనుగుణంగానే ఈ యాగం కూడా ఏకోత్తరవృద్ధి విధానంలో జరగబోతుంది. ఆయుత చండీయాగంతో పాటు రుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్రహోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు జరగనున్నాయి.

-శంగేరి పీఠం వేద పండితులు పురాణం మహేశ్వశర్మ, శశాంక్‌శర్మ, గోపికృష్ణలు అయుత చండీయాగం పూజలు నిర్వహిస్తారు.
-ఆయుత చండీయాగానికి మొత్తం 15 వందల మంది ఋత్వికులు హాజరుకానున్నారు.
-చండీయాగం స్థలంలో 108 హొమం గుండాలు ఏర్పాటు చేస్తారు.
-ఒక్క హోమం గుండా వద్ద 11 మంది బ్రహ్మణులు పారాయణలు, జపాలు చేస్తారు.
-ఐదు రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీయాగనవాక్షరీ చేస్తారు.
-22న ఉదయమే బ్రహ్మణులు చండీయాగం స్థలానికి చేరుకుంటారు.
-మొదటి రోజు 11 వందల మంది బ్రహ్మణులు ఒకేసారి సప్తశతి చేసి, 4 వేల పారాయణలు చేస్తారు.
-రెండోరోజు 11 మంది బ్రహ్మణులు 2 పారాయణలు చేసి, 3 వేల జపం చేస్తారు.
-మూడో రోజు 11 మంది బ్రహ్మణులు మూడు పారాయణలు, 2 వేల జపం చేస్తారు.
-నాలుగవ రోజు 11 మంది బ్రహ్మణులు 4 పారాయణలు, వేయ్యి జపం చేస్తారు.
-చివరి రోజు ఒక్క హోమ గుండం వద్ద 11మంది ఋత్విక్కులు పాలతో 10 వేల పారాయణలు, దశాంశం వేయిసార్లు తర్పణలిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.
-మిగతా 4 వందల మంది బ్రాహ్మణులు 11 మంది బ్రాహ్మణులకు సేవలు అందిస్తారు.
-బ్రాహ్మణులకు ఉండేందుకు 4 యాగశాలలు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఐదు రోజులు ఉండేందుకు వసతులు కల్పించనున్నారు.
-చండీయాగంలోకి ఋత్విక్కులు తప్ప మిగతా వారికి అవకాశం లేదు.
-విఐపిలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
-మంత్రులకు, ఎమ్మెల్యేలకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు.
-భక్తులు, ప్రజల కోసం ప్రధాన గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.
-ప్రతి రోజు 10 వేల నుండి 60 వేల భక్తులకు భోజన ఏర్పాట్లు అందించే విధంగా పెద్ద ఎత్తున్న భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
-బ్రహ్మణులకు తమ గ్యాలరీలల్లోనే భోజన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
-అలాగే ప్రతి గ్యాలరీ వద్ద చండీయాగం చూసేందుకు టివిలను ఏర్పాటు చేస్తున్నారు.
-మీడియాకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు.
-ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హరికథలు నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రముఖ 40 మంది హరినాథులను హాజరు కానున్నారు.
-ప్రతి గ్యాలరీ వద్ద సిసి కెమెరాలను బిగిస్తున్నారు. అలాగే వ్యవసాయక్షేత్రం చుట్టూ కూడా పెట్టే అలోచనలో ఉన్నారు.

పోలీసులు ఆధీనంలో ఉండేవి...

-శుక్రవారం నుండే చండీయాగ స్థలాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.
-వ్యవసాయక్షేత్రం చుట్టూ ఐదు దిక్కుల చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.
-ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, గంగాపూర్, వర్ధరాజ్‌పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో 10 పార్కింగ్ స్థలాలను గుర్తించారు.
-ప్రతి ఒక్కరి వాహనాలు పార్కింగ్‌లలో పెట్టి చండీయాగం స్థలానికి నడుచుకుంటూ వెళ్లాలి.
- జిల్లా పోలీస్‌యంత్రాగంతోపాటు ఇతర జిల్లాల నుంచి భారీగా పోలీస్‌ బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
-ప్రతిరోజు జిల్లా ఎస్పీ సుమతి యాగం స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు.
-వ్యవసాయక్షేత్రం వైపు ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు.
-ఎర్రవల్లి మీదుగా భక్తులకు, ప్రజలకు, నాయకులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
-విఐపి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అతిధులకు శివారువెంకటాపూర్ నుండి అనుమతి కల్పించనున్నారు.
-33 ఎకరాల్లో చండీయాగం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
-యాగశాలలపై ఎండు గడ్డిని కప్పి అందంగా తయారు చేస్తున్నారు. ప్రతిరోజు నాలుగైదు డిసిఎంల గడ్డి వస్తుంది.
-రూటు మ్యాప్ ప్రకారం సౌకర్యాలు కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement