పట్టా భూములపై దౌర్జన్యం సరికాదు | Assault on land is not correct | Sakshi
Sakshi News home page

పట్టా భూములపై దౌర్జన్యం సరికాదు

Published Thu, Mar 22 2018 1:16 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Assault on land is not correct - Sakshi

తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న నాగల్‌కొండ గ్రామస్తులు 

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): ఇరవై ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై ఆదివాసీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నాగల్‌కొండ గిరిజనులు బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ ముంజం సోముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు జాదవ్‌ గుణవంతరావు, నాజమ్, రాథోడ్‌ రమేశ్‌ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేసుకుని అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భూములు మావి అంటూ కొందరు తమ పంటపొలాలను తొలగిస్తున్నారన్నారు.

పట్టా భూములపై ఈ ర కంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించా రు. లంబాడాలు అంటే ఏమైనా ఇతర దేశం నుంచి వచ్చిండ్రా.. పాకి స్తాన్‌లో ఉన్న భారతీయులపై కూడా ఇంత దౌర్జన్యం లేదన్నారు. మా భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఉరుకునేది లేదన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన వందలాది మంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement