అత్తింటివారు ఇబ్బందులు పెడుతున్నారని, తనకు న్యాయం చేయూలని కోరుతూ వివాహిత కలెక్టర్ క్యాంప్ ఆఫీస్...
► అత్తింటివారు వేధిస్తున్నారు
► కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట వివాహిత నిరసన
కరీంనగర్‌క్రైం : అత్తింటివారు ఇబ్బందులు పెడుతున్నారని, తనకు న్యాయం చేయూలని కోరుతూ వివాహిత కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆదివారం రాత్రి నిరసన తెలిపింది. వివరాలు బాధితురాలి క థనం ప్రకారం. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన మాలోతు సుజాత(24) భర్త కిరణ్‌తో కలిసి స్థానిక రాంనగర్‌లో నివాసముంటున్నారు. అయితే కిరణ్ ఆదివారం భార్య సుజాతతో చెప్పకుండా కుమారుడిని తీసుకుని పెగడపల్లికి వెళ్లిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న సుజాత అత్తారింటికి వెళ్లింది. బాబును ఇవ్వాలని కోరగా అత్తింటివారు కొట్టారని కరీంనగర్‌లోని టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టూటౌన్ పోలీసులు పెగడపల్లి నుంచి బాబును తీసుకొచ్చి సుజాతకు అప్పగించారు. భర్త కిరణ్‌పై కేసు నమోదు చేయాలని కోరగా కౌన్సెలింగ్ అనంతరం చేస్తామని పోలీసులు చెప్పారు. దీంతో ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. కలెక్టర్ ఆమెతో మాట్లాడి.. కేసు నమోదు చేయూలని పోలీసులకు సూచించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ తెలిపారు.