
రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. రేవంత్ బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ రేపు సుప్రీంలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రేవంత్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్లకు బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ అధికారులు ఈ పిటిషన్లో పేర్కొన్నారు.