
సివిల్ సర్వీసెస్ అధికారుల విభజన చేపట్టాలి
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల విభజన జరగలేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ బుధవారం లోక్‌సభలో జీరోఅవర్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు.
లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం అవతరించి ఆరునెలలు దాటినా ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల విభజన జరగలేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ బుధవారం లోక్‌సభలో జీరోఅవర్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు.
అధికారుల విభజన జరగని కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం ఇంకా కేంద్ర సిబ్బంది, శిక్షణవ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో పెండింగ్‌లో ఉందని, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని బాల్క సుమన్ కోరారు.