నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకటే హై కోర్టు ఉందని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌ఎల్ శాస్త్రి, ఆర్ నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 3వ తేదీ నుంచి 6 వరకు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దదాన్నగారి మాధుసుదన్‌రావు, రెంజర్ల సురేశ్, ఏడ్ల గంగారత్నం, మాహిళా న్యాయవాదులు కల్పన నీరజరెడ్డి, మితుల్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయండి
Published Wed, Jun 4 2014 2:42 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement