వచ్చే ఎన్నికలే టార్గెట్!
► భవిష్యత్ కార్యాచరణ, అమిత్‌షా పర్యటనపై బీజేపీ దృష్టి
► నేడు, రేపు సంగారెడ్డిలో బీజేపీ కార్యవర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడం, భవిష్యత్ కార్యా చరణ, ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూ హాలను రూపొందించుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరు గనున్న నేపథ్యంలో... పార్టీ కోసం పూర్తికాలం పనిచేసే నేతలు, కార్యకర్తల గుర్తింపు, జిల్లా స్థాయిలో కార్యకలాపాల పర్యవేక్షణ, సమీక్షకు జిల్లా ఇన్‌చార్జుల నియామకం తదితర అంశా లపై కసరత్తు ప్రారంభించింది. వచ్చేనెల 23, 24, 25 తేదీల్లో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యం లో.. ఏయే కార్యక్రమాలను నిర్వహించాలి, పర్యటనను పార్టీ బలోపేతానికి ఏవిధంగా ఉపయోగించుకోవాలనేదానిపై దృష్టి పెట్టిం ది.
బుధ, గురువారాల్లో సంగారెడ్డిలో జరగను న్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశాలన్నింటిపై చర్చించి ప్రణాళికలను సిద్ధం చేసుకోనున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తొలిరోజు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, రెండో రోజు రాష్ట్ర కార్యవర్గం భేటీ కానున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరగనున్న తొలిరోజు సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా ర్జి(సంస్థాగత) సావధాన్‌సింగ్, రాష్ట్ర ఇన్‌చార్జి కృష్ణదాస్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రే య, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఇతర నాయకులు హాజరుకానున్నారు. రెండోరోజు భేటీలో కేంద్ర మంత్రి హాన్స్‌రాజ్ అహిర్ పాల్గొననున్నారు.
టీఆర్‌ఎస్ వైఫల్యాలపై తీర్మానం
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లభించకపోవడం, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ఓయూ శతాబ్ది ఉత్స వాలు, ›ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో మాతా శిశు మరణాలు తదితర అంశాలతో సమావే శంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. జాతీయ ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఇక పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు ఏవిధంగా ఉండాలనే దానిపై చర్చించనున్నారు.
ఫుల్‌టైమర్లపై కసరత్తు
రాష్ట్రంలో పార్టీ కోసం ఆరునెలల నుంచి ఏడాదిన్నర వరకు పనిచేసేందుకు 50 మంది పూర్తికాలం కార్యకర్తలు (ఫుల్ టైమర్లు) సంసిద్ధులై ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. సోమ, మంగళవా రాల్లో హైదరాబాద్ నగర శివార్లలోని ఒక కాలేజీలో నిర్వహించిన శిక్షణా శిబిరాల సందర్భంగా పార్టీ ముఖ్యులకు దీనిపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. పార్టీకి పట్టులేని, ఇతర పార్టీల ముఖ్యనేతలకు గట్టి పట్టున్న సీట్లను మినహాయించి.. మిగతా దాదాపు వంద అసెంబ్లీ నియో జకవర్గాల్లో ఒక్కొక్కరి చొప్పున ఫుల్ టైమర్లను నియమించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. వచ్చే ఎన్నిక ల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంట రిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ఈ మేరకు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.