Future activity
-
27న భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి
ఘజియాబాద్: వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ బుధవారం తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాలపై కూడా మోదీ సర్కారును నిలదీస్తామన్నారు. ‘శనివారం మేము సమావేశం కానున్నాం. అక్కడ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం. జనవరి 1 నుంచి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అదెలా చేస్తారో చెప్పాలని మేము ఆయన్ని అడుగుతాం’ అని తికాయత్ ట్వీట్ చేశారు. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఏం జరగబోతోంది?.. ఈటల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన నేపథ్యంలో ఈటల రాజేందర్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీపై అభిమానుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ విచారణపై ఈటల.. న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈటల తన సతీమణి పేరు మీద నెలకొల్పిన జమున హాచరీస్ సంస్థ భూ ఆక్రమణలకు పాల్పడిందని ఇప్పటికే మెదక్ కలెక్టర్ ధ్రువీకరించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నివేదిక కూడా అందజేశారు. మరోవైపు భూకబ్జా, అటవీ చట్టాల ఉల్లంఘన కేసులు నమోదుతో పాటు, అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం చర్యలకు కలెక్టర్ సిఫార్స్ చేసిన సంగతి విదితమే. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. మరో వైపు ప్రభుత్వానికి నేడు విజిలెన్స్ నివేదిక అందజేయనుంది. అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ అరెస్ట్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శామీర్ పేట్‌లోని ఈటల రాజేందర్ నివాసానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. చదవండి: ఫిర్యాదులు; రాష్ట్రవ్యాప్తంగా ఈటల ఆస్తులపై ఆరా! రెండోసారి పవర్.. ఈటలపై నజర్! -
రోజుకు మరో గంట పెరుగుతుంది...
రోజుకు 24 కంటే ఎక్కువ గంటలుంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా? మీ ఆశ ఇప్పుడు కాకపోయినా ఇంకో రెండు వేల ఏళ్లకైనా నిజం కానుంది! అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి నుంచి జాబిల్లి నెమ్మదిగా దూరం జరగడం దీనికి కారణమవుతోందని.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉంటాయన్నది వీరి అంచనా. కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మాడిసన్ పరిశోధకులు దాదాపు తొమ్మిది కోట్ల ఏళ్ల క్రితం నాటి రాళ్లను పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పురాతన కాలంలో... కచ్చితంగా చెప్పాలంటే 140 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు సగటున 18 గంటలు, గంటకు 41 నిముషాలు మాత్రమే ఉండేవని తెలిసింది.. భూమండలం కక్ష్య నుంచి చందమామ నెమ్మదిగా పక్కకు జరుగుతున్న కొద్దీ రోజులో గంటలు పెరుగుతున్నాయని తేల్చారు. ఈ విధంగా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్ది భూభ్రమణం కూడా నెమ్మదిస్తుందని విస్కాన్సిన్–మాడిసన్ విశ్వవిద్యాలయ జియోసైన్స్ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ వెల్లడించారు. భూమి నుంచి చందమామ ఏడాదికి 3.82 సెంటీ మీటర్ల చొప్పున దూరం జరుగుతున్నట్టు అంచనా. జాబిల్లితోపాటు అనేక ఇతర గ్రహాలు, నక్షత్రాల గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై ఉంటుందని.. ఇది కాస్తా భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సౌరవ్యవస్థలో వచ్చే మార్పుచేర్పులకు అనుగుణంగా రోజులో పగటి వేళల్లో మార్పులు సంభవిస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వచ్చే ఎన్నికలే టార్గెట్!
► భవిష్యత్ కార్యాచరణ, అమిత్‌షా పర్యటనపై బీజేపీ దృష్టి ► నేడు, రేపు సంగారెడ్డిలో బీజేపీ కార్యవర్గ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడం, భవిష్యత్ కార్యా చరణ, ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూ హాలను రూపొందించుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరు గనున్న నేపథ్యంలో... పార్టీ కోసం పూర్తికాలం పనిచేసే నేతలు, కార్యకర్తల గుర్తింపు, జిల్లా స్థాయిలో కార్యకలాపాల పర్యవేక్షణ, సమీక్షకు జిల్లా ఇన్చార్జుల నియామకం తదితర అంశా లపై కసరత్తు ప్రారంభించింది. వచ్చేనెల 23, 24, 25 తేదీల్లో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యం లో.. ఏయే కార్యక్రమాలను నిర్వహించాలి, పర్యటనను పార్టీ బలోపేతానికి ఏవిధంగా ఉపయోగించుకోవాలనేదానిపై దృష్టి పెట్టిం ది. బుధ, గురువారాల్లో సంగారెడ్డిలో జరగను న్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశాలన్నింటిపై చర్చించి ప్రణాళికలను సిద్ధం చేసుకోనున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తొలిరోజు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, రెండో రోజు రాష్ట్ర కార్యవర్గం భేటీ కానున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరగనున్న తొలిరోజు సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చా ర్జి(సంస్థాగత) సావధాన్‌సింగ్, రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రే య, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఇతర నాయకులు హాజరుకానున్నారు. రెండోరోజు భేటీలో కేంద్ర మంత్రి హాన్స్‌రాజ్ అహిర్ పాల్గొననున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలపై తీర్మానం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లభించకపోవడం, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ఓయూ శతాబ్ది ఉత్స వాలు, ›ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో మాతా శిశు మరణాలు తదితర అంశాలతో సమావే శంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. జాతీయ ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఇక పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు ఏవిధంగా ఉండాలనే దానిపై చర్చించనున్నారు. ఫుల్టైమర్లపై కసరత్తు రాష్ట్రంలో పార్టీ కోసం ఆరునెలల నుంచి ఏడాదిన్నర వరకు పనిచేసేందుకు 50 మంది పూర్తికాలం కార్యకర్తలు (ఫుల్ టైమర్లు) సంసిద్ధులై ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. సోమ, మంగళవా రాల్లో హైదరాబాద్ నగర శివార్లలోని ఒక కాలేజీలో నిర్వహించిన శిక్షణా శిబిరాల సందర్భంగా పార్టీ ముఖ్యులకు దీనిపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. పార్టీకి పట్టులేని, ఇతర పార్టీల ముఖ్యనేతలకు గట్టి పట్టున్న సీట్లను మినహాయించి.. మిగతా దాదాపు వంద అసెంబ్లీ నియో జకవర్గాల్లో ఒక్కొక్కరి చొప్పున ఫుల్ టైమర్లను నియమించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. వచ్చే ఎన్నిక ల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంట రిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ఈ మేరకు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. -
డీజీపీ కార్యాలయంలో ‘సిట్’ భేటీ
భవిష్యత్తు కార్యాచరణపై చర్చ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకొచ్చాక దీనికి కౌంటర్‌గా ఏపీలో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శనివారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో భేటీఅయింది. సిట్ సారథి డీఐజీ మహ్మద్ ఇక్బాల్‌తోపాటు సభ్యులుగా ఉన్న చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏఎస్పీ దామోదర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాథమికంగా 13 జిల్లాల్లో నమోదై, తమకు బదిలీ అయిన 88 కేసుల స్వరూపస్వభావాలను చర్చించారు. దర్యాప్తు ఏ కోణంలో ప్రారంభించాలి, నోలీసుల్ని ఏ ఏ నేరాలకింద, ఎవరెవరికి జారీచేయాలి అనేది ఖరారు చేయడానికి న్యాయనిపుణులతోనూ సిట్ సంప్రదింపులు జరుపుతోంది. సోమవారం నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ నుంచి బదిలీ అయిన ‘మత్తయ్య కేసు’ దర్యాప్తునూ సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో టీఆర్ఎస్, హైదరాబాద్ ఏసీబీ పేర్లతో వచ్చిన ఫోన్ బెదిరింపులు ప్రధాన ఆరోపణ కావడంతో ఆయా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి మత్తయ్యతోపాటు మరికొందరి కాల్ డేటాలను అధికారికంగా తీసుకున్న దర్యాప్తు అధికారి విశ్లేషించడం ప్రారంభించారు.సోమవారం నుంచి నోటీసుల జారీతోపాటు ఇతర చర్యలు మొదలుపెడతారని తెలుస్తోంది. 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్‌గానీ ఇతర మంత్రుల ఫోన్లుగానీ ట్యాప్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాలంటూ 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ శనివారం నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సీఎం చంద్రబాబు ఫోన్ ఆడియో సంభాషణల టేపులు బయటపడిన సంగతి తెలిసిందే. -
సమ్మె ఆపేది లేదు: జూడాలు
హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్యా, ఇమ్రాన్లు మీడియాతో మాట్లాడారు. తాము చేస్తున్న పోరాటం న్యాయమైనదని పేర్కొన్నారు. తమ సమ్మె వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయని ఆరోపించడం సరికాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. వైద్యవిద్య ప్రైవేటీకరణ వల్లే: చుక్కా రామయ్య వైద్యం ప్రైవేటుపరం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజామద్దతు లేని నిరసన వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని వారికి సూచించారు. పేదరోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. జూడాల తల్లిదండ్రులకు నోటీసులు గత నెలరోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను డిబార్ చేస్తామని గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆదివారం హెచ్చరించింది. ఈ మేరకు తమ కళాశాలలో చదువుతన్న విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసింది. తక్షణమే విధులకు హాజరు కావాలని, లేకుంటే డిబార్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు తమకు నోటీసులు అందినట్లు గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థుల తల్లితండ్రులు మీడియాకు తెలిపారు. -
దూసుకెళ్లుడే..!
ఇక శరవేగంగా అభివృద్ధి * ప్రాధాన్యత ప్రకారం పనుల వివరాలివ్వండి * పనిచేయని అధికారులను మార్చండి * జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. దాదాపు 5 నెలల పాటు సమగ్ర సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీనలతో ప్రజా సమస్యల మూలాల్ని గుర్తించిన ఆయన ఇక వాటిని పెకిలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీపావళి తర్వాత అభివృద్ధి పనులు దూసుకపోతాయని చెప్పిన సీఎం అదే మాట మీద నిలబడ్డారు. ఈమేరకు శుక్రవారం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మదన్రెడి ్డ, ఎంపీలు బీబీపాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీ భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, సుధాకర్‌రెడ్డిలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లోప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాటర్ గ్రిడ్ విద్యుత్తు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, ఆహార భద్రత కార్డులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యే వద్ద నుంచి ఆయన వారి వారి నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల సమగ్ర వివరాలను తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే,ఎంపీతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి వారి సాదకబాధకాలు తెలుసుకున్నట్లు తెలిసింది. మంచిగా లేకుంటే మార్చుకోండి.. ఆయా నియోజకవర్గాల్లోని అధికారుల వైఖరిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ‘అధికారులు సరిగా పని చేయకపోతే, మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పనులు చేపట్టినా ఫలితం ఉండదు, ప్రభుత్వానికి మంచి పేరు రాదు’ కనుక అనుకూలంగా లేని అధికారులను మార్చుకోవచ్చని కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. అలాంటి అధికారులు ఏ శాఖలో ఉన్నా సరే వారి వివరాలు తనకు ఇవ్వాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పాటు ప్రజలతో మమేకమై పని చేసే అధికారులు మీ దృష్టిలో ఎవరైనా ఉంటే, వారి పేర్లను సూచించమని కూడా అడిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు కోరిన చోట వారివారి నియోజకవర్గాల్లో అధికారులకు పోస్టింగు ఇచ్చేందుకు కూడా ఆయన అంగీకరించినట్లు తెలిసింది. భూపాల్‌రెడ్డి ఇంట్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భేటీ సీఎంతో సమావేశం ముగిసిన అనంతరం రాత్రి పొద్దుపోయాక టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పటాన్‌చెరులోని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఇంట్లో భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించినట్లు తెలిసింది. -
సమష్టి నిర్ణయంతోనే రాష్ట్రాధ్యక్షుడి ఎంపిక
సాక్షి, బెంగళూరు : పార్టీలో అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర జేడీఎస్ నూతన అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ తెలిపారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడి స్థానానికి కుమారస్వామి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు భవిష్యత్ కార్యాచరణ విషయమై బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం సమావేశమయ్యారు. సమావేశం తర్వాత దేవెగౌడ మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్రాధ్యక్ష స్థానం ఎవరికి ఇవ్వాలనే విషయమై సీనియర్ నాయకులు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. గురువారం జరిగే జేడీఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలనూ సేకరిస్తామని అన్నారు. అటుపై మరోసారి చర్చించి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మంగళవారం నూతన అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామన్నారు. కాగా, ఓటమికి కుంగిపోయి, విజయానికి పొంగిపోయే మనస్థత్వం తనది కాదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దేవెగౌడ పేర్కొన్నారు. మల్లికార్జున రాజీనామా.. బీదర్ జిల్లా బసవకళ్యాణ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లికార్జున సిద్ధరామప్ప ఖుబా తన పదవికి, పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. తనకు ప్రతి పక్ష విప్ స్థానం ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు అతను ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడకు పంపినట్లు చెప్పారు. దీనిపై గౌడ మాట్లాడుతూ.. మల్లికార్జున రాజీనామా చేసిన మాట వాస్తమేనన్నారు. ఈ విషయమై తనతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సొంత పార్టీలోని తన రాజకీయ శత్రువైన బండప్ప కాశంపురికి పార్టీ పెద్దలు రాష్ర్ట అధ్యక్షుడి స్థానాన్ని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో మల్లికార్జున రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్లు సమాచారం. అందులో భాగంగానే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు కాకుండా దేవెగౌడకు పంపినట్లు తెలుస్తోంది. -
సామాజిక తెలంగాణ కోసం రథయాత్ర
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సాక్షి, హైదరాబాద్: సామాజిక పునాదులపై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రథయాత్ర చేయనున్నారు. జనాభా దామాషా పద్ధతిన అన్నివర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యారంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే ‘సామాజిక తెలంగాణ’ కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 26న వరంగల్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్తుల పరిరక్షణకోసమే ‘సమైక్యం’: ఆస్తుల పరిరక్ష రక్షణ కోసమే రాజకీయ నేతలు సమైక్య ఉద్యమం చేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు వంద నుంచి 10వేల ఎకరాల వరకు భూములను కలిగి ఉన్నారని, వాటి విలువే వేలకోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. రాష్ట్రం విడిపోవడం వారికి సమస్యే కాదని, ఆస్తులను కాపాడుకోవడమే సమస్య అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి, యూటీ, శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేసే కుట్ర చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని మంద కృష్ణ హెచ్చరించారు. -
సామాజిక తెలంగాణ కోసం రథయాత్ర
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సాక్షి, హైదరాబాద్: సామాజిక పునాదులపై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రథయాత్ర చేయనున్నారు. జనాభా దామాషా పద్ధతిన అన్నివర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యారంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే ‘సామాజిక తెలంగాణ’ కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 26న వరంగల్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్తుల పరిరక్షణకోసమే ‘సమైక్యం’: ఆస్తుల పరిరక్ష రక్షణ కోసమే రాజకీయ నేతలు సమైక్య ఉద్యమం చేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు వంద నుంచి 10వేల ఎకరాల వరకు భూములను కలిగి ఉన్నారని, వాటి విలువే వేలకోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. రాష్ట్రం విడిపోవడం వారికి సమస్యే కాదని, ఆస్తులను కాపాడుకోవడమే సమస్య అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి, యూటీ, శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేసే కుట్ర చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని మంద కృష్ణ హెచ్చరించారు.