
సాక్షి, గజ్వేల్ : గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల విజయ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విజయ ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రాణాపాయ స్థితి నుంచి ఆకుల విజయ తృటిలో తప్పించుకున్నారు.
గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై బీజేపీ తరపున ఆ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలో దింపిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్‌పై బీజేపీ తరపున విజయ పోటీ చేసి ఓటమి చెందారు.