
కేసీఆర్ ది బూటకపు సర్వే
వ్యతిరేకతను తప్పించుకునేందుకు కేసీఆర్ తమ ప్రభుత్వ పనితీరుపై సర్వే చేయించుకున్నాడని నాగం జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు కేసీఆర్ తమ ప్రభుత్వ పనితీరుపై, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించుకున్నాడని, ఇది బూటకపు సర్వే అని నాగం జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఎమ్మెల్యేల అవినీతి పెచ్చుమీరుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే నాగర్‌కర్నూల్‌లో తనపై పోటీచేసి గెలవాలని నాగం సవాల్ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలపై పడి దోచుకుంటున్నారని, అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తూ సహజ నిల్వలను రాత్రికి రాత్రిళ్లే అధికార బలంతో రాజధానికి తరలిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్‌తో అసత్యపు ప్రచారాలు చేయిండం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సర్వే నిర్వహించానని చెప్పడం తన ప్రోగ్రెస్ కార్డులో తనే మార్కులు వేసుకుని తనకు తానే గుడ్ అని పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.