సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లో చేర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు డిమాండ్‌చేశారు. ఇంకా వారిని విధుల్లో చేర్చుకోకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా బెదిరింపు ధోరణితో వ్యవహరించడం అన్యాయం, అక్రమమని ఇలాంటి ధోరణిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమ్మెను ముగించినట్లు అధికారికంగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ విడుదల చేసిన ప్రకటన చూస్తే ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగులను విధులకు అనుమతించవద్దని డైరెక్షన్ ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. బలహీనమైన ఆర్టీసీ కార్మికులపై సీఎం తన అధికార బలాన్ని ప్రయోగించి ఇది తన విజయంగా ఆనందిస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment